Shubman Gill's 12 records: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆడింది. టెస్ట్ రెండో రోజున కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ ఇప్పటివరకు తన టెస్ట్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగులు చేసి, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగుల భారీ స్కోరు సాధించడంలో సహాయపడ్డాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లో, గిల్ తన పేరు మీద అనేక పెద్ద రికార్డులను క్రియేట్ చేశాడు.
శుభ్‌మన్ గిల్ తన మొదటి రోజు స్కోరు 114 పరుగులకు మొదలు పెట్టి.. రవీంద్ర జడేజాతో కలిసి 203 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. తర్వాత వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 144 పరుగులు జోడించాడు. ఆల్ రౌండర్ బ్యాట్స్‌మెన్ ఇద్దరూ కెప్టెన్ గిల్‌కు సపోర్టుగా నిలిచారు. రవీంద్ర జడేజా సెంచరీ మిస్ అయితే వాషింగ్టన్ తన అర్ధ సెంచరీని మిస్ చేసుకున్నాడు. జడేజా 89 పరుగులు చేయగా, సుందర్ 42 పరుగులు అందించాడు. ఈ రికార్డ్ బ్యాటింగ్ కారణంగా, గిల్ మొత్తం 12 రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
గిల్ 269 పరుగుల ఇన్నింగ్స్‌లో బద్దలైన రికార్డులను చూద్దాం.
1. టెస్టుల్లో భారత కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు: 2019 లో పూణేలో దక్షిణాఫ్రికాపై 254 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డ బ్రేక్ చేశాడు.
2. ఇంగ్లాండ్‌లో భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక టెస్ట్ స్కోరు: 1979లో ది ఓవల్‌లో సునీల్ గవాస్కర్ చేసిన 221 పరుగుల రికార్డును శుభ్‌మాన్ గిల్ రికార్డ్ బ్రేక్ చేశాడు.
3. విదేశీ గడ్డపై 250+ పరుగులు చేసిన మూడవ భారతీయ బ్యాట్స్‌మన్: వీరేంద్ర సెహ్వాగ్ (309, ముల్తాన్ , 254, లాహోర్) రాహుల్ ద్రవిడ్ (270, రావల్పిండి) తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ భారతీయ బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు.
4. విదేశాల్లో టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన రెండవ భారత కెప్టెన్: విరాట్ కోహ్లీ 2016లో నార్త్ సౌండ్‌లో వెస్టిండీస్‌పై 200 పరుగులు చేశాడు.
Also Read: Kiwi In Monsoon: సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలంటే..ఈ సీజన్లో ఈ పండు తింటే చాలు..!!
5. టెస్ట్‌లలో డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్: మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ (7 సార్లు) తర్వాత డబుల్ సెంచరీ చేసిన ఆరో భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
6. టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండవ అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్: గిల్ 25ఏళ్ల 298 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. దీనికంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 23ఏళ్లు 239 రోజుల వయసులో డబుల్ సెంచరీ చేశాడు.
7. ఇంగ్లాండ్‌లో టెస్ట్‌ల్లో 250+ పరుగులు చేసిన మూడవ విదేశీ కెప్టెన్: ఇంగ్లాండ్‌లో టెస్ట్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడవ విదేశీ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఈ ఘనతను ఆస్ట్రేలియాకు చెందిన బాబ్ సింప్సన్ (311 పరుగులు, 1964) దక్షిణాఫ్రికాకు చెందిన గ్రాహం స్మిత్ (277, 259 పరుగులు, 2003) చేశాడు.
8. ఇంగ్లాండ్‌పై వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీలు సాధించిన నాల్గవ భారతీయుడు: మొహమ్మద్ అజారుద్దీన్, దిలీప్ వెంగ్‌సర్కార్, రాహుల్ ద్రవిడ్ (రెండుసార్లు) తర్వాత ఈ ఘనత సాధించిన నాల్గవ భారతీయ బ్యాట్స్‌మన్ గిల్.
9. ఇంగ్లాండ్‌పై వరుసగా టెస్ట్ సెంచరీలు సాధించిన మూడవ భారత కెప్టెన్: విజయ్ హజారే , మహ్మద్ అజారుద్దీన్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.
10. కెప్టెన్‌గా మొదటి టెస్ట్‌లో సెంచరీ, రెండవ టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన రెండవ భారతీయుడు: తన కెప్టెన్సీ కెరీర్‌లోని మొదటి రెండు టెస్ట్‌లలో సెంచరీ, డబుల్ సెంచరీ సాధించిన సునీల్ గవాస్కర్ తర్వాత గిల్ ఈ ఘనతను సాధించాడు.
11. SENA దేశాలలో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆసియా కెప్టెన్: శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్ 2011లో లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌పై 193 పరుగులు చేశాడు. ఇది ఒక ఆసియా కెప్టెన్ చేసిన అత్యధిక స్కోరు.
12. SENA దేశాలలో భారత బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు: శుభ్‌మాన్ గిల్ ఇప్పుడు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA)లలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు 2004లో సిడ్నీలో ఆస్ట్రేలియాపై అజేయంగా 241 పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.