MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని అన్ని పార్మట్ క్రికెట్ టోర్నీల నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడిక అతనికి మిగిలింది ఐపీఎల్ మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వెన్నంటిగా, కుడిభుజంగా ఉంటూ వస్తున్న ఎంఎస్ ధోని ఎప్పుడు సడెన్ సర్‌ప్రైజ్ ఇస్తాడో తెలియని పరిస్థితి. రిటైర్మెంట్ ఆలోచన లేదన చెబుతున్నా ఆకశ్మిక నిర్ణయాలు అతనికి కొత్త కాదు.
టీమ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక్కొక్క క్రికెట్ ఫార్మట్ నుంచి వైదొలగిన విధానం అందర్నీ ఆశ్చర్య పరుస్తూనే సాగింది. కెప్టెన్ గా మంచి కెరీర్ కొనసాగుతుండగానే 2014 డిసెంబర్ నెలలో టెస్ట్ ఫార్మట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తరువాత 2020 ఆగస్టు 15న వన్డే, టీ20 ఫార్మట్‌కు గుడ్ బై చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. వన్డే, టీ20 ఫార్మట్‌కు వీడ్కోలు పలకడం మాత్రం నిజంగా అందరికీ షాక్ ఇచ్చింది. అప్పట్నించి చెన్నై ఐపీఎల్ టీమ్ తరపున ఆడుతూనే ఉన్నాడు. ఐదేళ్లుగా మరో నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికీ తనలో ఆడే సత్తా, కీపింగ్ సామర్ధ్యం ఉందని నిరూపిస్తూనే ఉన్నాడు. మూడేళ్ల క్రితం మాత్రం ఐపీఎల్ ఫ్రాంచైజీ కెప్టెన్సీ వదులుకున్నాడు.
ఇప్పటికీ 43 ఏళ్ల వయస్సులో బ్యాటింగ్ పరంగా రాణించలేకున్నా కీపింగ్‌లో తనకెవరూ సాటిలేరని నిరూపిస్తున్నాడు. ఎంతకాలం ఇంకా కొనసాగుతాడంటే సీఎస్కే టీమ్ ఉన్నంతవరకూ అని చెప్పేవాళ్లున్నారు. సీఎస్కే యాజమాన్యం ధోనీని తప్పించే సాహసం చేయదనేది చాలా మంది నమ్మకం. ఐపీఎల్ టోర్నీలో అత్యంత పెద్ద వయస్సు కలిగిన ఆటగాడు ధోనీ మాత్రమే. అందుకే అందరి దృష్టీ ఎప్పుడూ ధోనీపై ఉంటుంది.
అందరూ ఆతని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వ్యాప్తి చేస్తున్న తరుణంలో స్వయంగా ధోనీ స్పందించాడు. ఇప్పట్లో తన రిటైర్మెంట్ లేదని చెప్పేశాడు. తానిక ఐపీఎల్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకునేందుకు మరో 10 నెలల సమయం ఉందని చెప్పాడు. జూలైతో 44వ ఏట అడుగుపెట్టనున్న తాను తన శరీరం ఎలా సహకరిస్తే అలా చేస్తానన్నాడు.
అయితే ఎంత కూల్‌గా ఆడతాడో అతని నిర్ణయాలు కూడా అంతే కూల్‌గా ఉంటాయి. అందుకే ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటన ఎప్పుడు ఉంటుందనేది అందరికీ ఆసక్తిగానే మారింది.
Also read: AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో రానున్న 4 రోజులు వర్షాలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి