Brian Lara Highest Test Score: వియాన్ ముల్డర్.. ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దక్షిణాఫ్రికా తాత్కలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ముల్డర్.. జింబాబ్వేపై అద్భుత ఇన్నింగ్స్ (367 నాటౌట్)తో ఆకట్టుకున్నాడు. మరో 34 పరుగులు చేస్తే.. టెస్టుల్లో బ్రియాన్ లారా (400) అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. లారా మీద గౌరవంతో రికార్డుకు చేరువగా వచ్చినా ఆగిపోయాడు. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 626 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.
బ్రియాన్ లారా అంటే తనకు ఎంతో ఇష్టమని.. ఆయనపై ఉన్న గౌరవం తనకు డిక్లేర్ చేయాలని అనిపించిందని వియాన్ ముల్డర్ ఇన్నింగ్స్ అనంతరం చెప్పాడు. "బ్రియాన్ లారా ఒక లెజెండ్. అతను ఇంగ్లాండ్‌పై 400 పరుగులు చేశారు. ఈ రికార్డు లారా వంటి గొప్ప బ్యాటర్‌పైనే ఉండాలి. ఆయనే నాకు స్ఫూర్తి. ఆ స్థాయి ఉన్న వ్యక్తి రికార్డును నిలబెట్టుకోవడానికి అర్హులు. నాకు మరో అవకాశం వచ్చినా ఆ రికార్డును దాటే ప్రయత్నం చేయను" అంటూ ముల్డర్ చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా తరుఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ముల్డర్ నిలవగా.. ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలిచాడు. ముల్డర్ నిర్ణయంత దక్షిణాఫ్రికా కోచ్ శుక్రీ కాన్రాడ్‌తో కూడా ఏకీభవించారు. "బ్రియాన్ లారా వంటి లెజెండ్ రికార్డును ఉంచనివ్వండని ముల్డర్ నాతో కూడా అన్నాడు. నా విధి ఎలా ఉంటుందో నాకు ఎప్పటికీ తెలియదని.. కానీ బ్రియాన్ లారా రికార్డు అంటే అలాగే ఉండాలని ముల్డర్ అన్నాడు." అని శుక్రీ కాన్రాడ్ తెలిపారు.
ఈ ఇన్నింగ్స్‌లో 334 బంతులు ఎదుర్కొన్న ముల్డర్.. 49 ఫోర్లు, నాలుగు సిక్సర్లు సాయంతో 367 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సరికొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉన్నా.. తనకు స్పూర్తిగా నిలిచిన ప్లేయర్‌పై అభిమానంతో ఆగిపోయిన ముల్డర్‌పై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని కలియుగంలో ఏకలవ్యూడు అంటూ పొగుడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 236 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. సఫారీ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 626 పరుగుల చేయగా.. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఫాలో ఆన్ ఆడిన జింబాబ్వే.. రెండో ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా వరుసగా రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలుపొంది.. సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్ షాపులు బంద్.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?
Also Read: Monsoon Fruit Diet: వానాకాలంలో ఈ ఫ్రూట్స్‌కు ఆమడ దూరం ఉండాలి.. తిన్నారో అంతే సంగతులు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook