MS Dhoni Retirement: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి నేటి వరకు ఆడుతూ 18 ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులకు వినోదం అందిస్తున్న స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఇక నిష్క్రమించే సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. కొన్నేళ్లుగా అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుండగా ఐపీఎల్ 2025 సీజన్ చివరిదనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి కొన్ని పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి.
Also Read: CSK vs KKR: కోల్‌కత్తా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై.. ధోనీ కెప్టెన్సీలో జట్టు ఓడిపోయిందా?
ఇటీవల జరిగిన మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులతోపాటు భార్య, కుమార్తె హాజరైన విషయం తెలిసిందే. ఆ రోజే రిటైర్మెంట్ ప్రకటన ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. అయితే ఆ మ్యాచ్‌తోపాటు తాజాగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోరంగా ఓటమిపాలైంది. ఆ ఒక్క మ్యాచ్ కాదు వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయారంటే ఇది ఐపీఎల్ సీజన్‌లోనే అత్యంత చెత్త రికార్డు.
Also Read: RCB vs DC: కేఎల్ రాహుల్ సంచలన ఇన్నింగ్స్.. కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆధిపత్యం
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంఎస్ ధోనీ సుదీర్ఘ కాలంగా సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. అతడి సారథ్యంలోనే చెన్నై జట్టు ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. భారత క్రికెట్ జట్టును అత్యంత విజయవంతంగా నడిపిన పేరు ఉన్న ఎంఎస్ ధోనీకి ఐపీఎల్‌లో కూడా అదే పేరు ఉంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్ కాదు ఆటగాడిగా.. ముఖ్యంగా గొప్ప ఫినిషర్‌గా ధోనీకి గుర్తింపు ఉంది. ధోనీ అంటే ఒక పేరు కాదు క్రికెట్‌లో ఒక బ్రాండ్. కూల్‌గా ఉంటూ రాగద్వేషాలను నియంత్రించుకుంటూ మౌన మునిలా వ్యూహాలు పన్నుతూ ప్రత్యర్థిని తన కెప్టెన్సీతో బెంబేలెత్తించే ధోనీలో మార్పు వచ్చిందని తెలుస్తోంది. సీఎస్కేను విజయవంతంగా నడిపిన ధోనీ గతంలో మాదిరి లేనట్టు కనిపిస్తోంది. దాని ఫలితమే సీఎస్కే ఈ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం.
ఎన్నో రికార్డులు
గతంలోనే కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్న ఎంఎస్ ధోనీ జట్టుకు తన సలహాలు, సూచనలు ఇస్తూ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. నాలుగు పదుల వయసు దాటిన ధోనీ గతంలోనే రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధమవగా అతడిపై గౌరవం.. అతడు జట్టుకు అందించిన సేవలను గుర్తిస్తూ ఫ్రాంచైజీ యాజమాన్యం ఆటగాడిగా కొనసాగాలని ధోనీని బతిమిలాడడంతో ఇప్పటివరకు ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. అయితే ధోనీ ఫిట్‌గా లేకపోవడం.. ఫామ్‌లో లేనట్టు కనిపిస్తోంది. దీనికితోడు అతడు కెప్టెన్‌గా విఫలమైనట్లు కనిపిస్తోంది. దాని ఫలితమే ఐదు మ్యాచ్‌ల ఓటమి. ఎన్నో విజయాలు.. రికార్డులు సొంతం చేసుకున్న ధోనీ ఆటలో తడబడుతున్నాడు. ఏ ఆటగాడైనా ఎప్పటికైనా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవాలు ఎదుర్కొంటుండగా.. ధోనీ కెప్టెన్సీలో కూడా ఆ జట్టు విజయం సాధించలేదు.
సీజన్ ముగింపునకు ప్రకటన?
జట్టు ఫెయిల్యూర్స్‌కు ధోనీ కూడా ఒక కారణం అనే అపప్రద రాకముందే ధోనీ ముందే రిటైర్మెంట్ ఇస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిటైర్మెంట్ చేయాలనే డిమాండ్ రాకముందే ధోనీ గౌరవంగా తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే జట్టు యాజమాన్యానికి ధోనీ సమాచారం ఇచ్చాడని.. వాళ్లు కూడా అంగీకరించినట్లు సమాచారం. చెన్నై జట్టు ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా అదే రోజు ధోనీ రిటైర్మెంట్ ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది. అది కాకుంటే ఈ సీజన్ ముగింపు లోపు ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేయవచ్చు. ఏది ఏమైనా ఇంకా కొన్ని రోజులు మాత్రమే ధోనీ ఐపీఎల్‌లో.. క్రికెట్ మైదానంలో కనిపించేది. ఈ విషయం తలచుకుంటే సదరు క్రికెట్ అభిమాని ఆవేదనకు లోనవుతాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.