HMD Glass Smartphone Uniqueness: ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ కంపెనీ నోకియా HMDగా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే.. అయితే, మార్కెట్లోని కస్టమర్స్‌కి హెచ్ఎండి ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్స్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రీమియం ఫీచర్స్‌తో ప్రత్యేకమైన మొబైల్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కెమెరా లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే సోషల్ మీడియాలో కొన్ని స్మార్ట్ ఫోన్స్‌కు సంబంధించిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటు చూసినా నోకియాకు సంబంధించిన గ్లాస్ స్మార్ట్ ఫోన్ ఫొటోస్ కనిపిస్తున్నాయి. చాలామంది ఈ స్మార్ట్ ఫోన్ అతి త్వరలోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.. ప్రముఖ నోకియా కొత్త కంపెనీ హెచ్ఎండి గ్లోబల్ ఈ గ్లాస్ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయలేదు..
కానీ సోషల్ మీడియాలో మాత్రం HMD గ్లోబల్ త్వరలోనే అత్యాధునిక ఫీచర్స్‌తో స్పెషల్ గ్లాస్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఇటీవలే వైరల్‌గా మారాయి.. ఇది అత్యంత శక్తివంతమైన 200-మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ మరతో విడుదల కాబోతున్నట్లు చాలా పోస్టులు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఇది హై ఎండ్ ప్రాసెస్‌తో విడుదల కాబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఎప్పుడు తెలుసుకుందాం..
200-మెగాపిక్సెల్ కెమెరా..
ప్రస్తుతం యువతను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండి గ్లోబల్ గ్లాస్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇది అత్యంత శక్తివంతమైన 200-మెగాపిక్సెల్ కెమెరాతో విడుదల కాబోతోంది .. అలాగే హెచ్ఎండి కంపెనీ ఈ మొబైల్‌లో అత్యంత శక్తివంతమైన సెన్సార్లు వినియోగించి కెమెరాను డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దీని బ్యాంక్ సెటప్‌లో ప్రత్యేకమైన కొన్ని అదనపు సెన్సార్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది అతను కెమెరా వివరాల్లోకి వెళితే ఇందులో కంపెనీ, అదనంగా 64-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా తో పాటు ప్రత్యేకమైన ఆప్టికల్ జూమ్ సామర్థ్యాలతో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ సెన్సార్ అదనపు కెమెరాను కూడా అందిస్తోంది.
AI అల్గారిథమ్..
ఇక ఈ మొబైల్‌లోని కెమెరా సిస్టం పూర్తిగా ఏఐ AI అల్గారిథమ్‌లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ప్రతి షార్ట్ ను రియల్-టైమ్‌లో ఆప్టిమైజ్ చేసి ప్రత్యేకమైన ఫీచర్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. వేగంగా కదిలే సబ్జెక్టులను కూడా ఎంతో సులభంగా క్యాప్చర్ చేసే ప్రత్యేకమైన శక్తివంతమైన సెన్సార్‌ను ఈ గ్లాస్ మొబైల్‌లోని కెమెరా సెటప్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే ఇందులో ఇంటెలిజెంట్ కెమెరా సిస్టమ్ కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ప్రత్యేకమైన TOF 3D డెప్త్ సెన్సింగ్ టెక్నాలజీ కూడా చేర్చినట్లు సమాచారం.. ఇది మార్కెట్లోకి విడుదలయితే ఎన్నో బ్రాండ్లకు సంబంధించిన శక్తివంతమైన స్మార్ట్ ఫోన్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
8200mAh బ్యాటరీ..
ఈ మొబైల్‌కు సంబంధించిన విశిష్టత ఏందంటే కేవలం గ్లాస్ మాత్రమే కలిగి ఉండడం.. అవును ఈ మొబైల్ బాడీ మొత్తం కేవలం గ్లాసులు మాత్రమే కలిగి ఉంటుంది.. ఈ మొబైల్ ప్రత్యేకమైన డిస్ప్లే సెటప్ ను కూడా కలిగి ఉంటుంది అంతేకాకుండా ప్రత్యేకమైన ప్రొటెక్షన్ కోసం ఇందులో హెచ్ఎండి కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ కూడా అందిస్తోంది.. ఈ మొబైల్ ను ప్రత్యేకమైన గ్లాస్ తో రెడీ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన డిస్ప్లే వివరాల్లోకి వెళితే ఇది 6.9-అంగుళాల సూపర్ AMOLED ప్యానెల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే 4K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది.. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 8200mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఇక కంపెనీ ఈ మొబైల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి