Home> టెక్నాలజీ
Advertisement

Lumia 1020 Price: HMD గ్లోబల్ నుంచి దిమ్మతిరిగే మొబైల్.. దీని డిజైన్ వేరే లెవెల్.. ధర, ఫీచర్స్ లీక్..

Nokia Lumia 1020 Hmd Features: ప్రముఖ మల్టీ నేషనల్  మొబైల్ కంపెనీ HMD గ్లోబల్  త్వరలోనే తమ లూమియా 1020 స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది శక్తివంతమైన ఫీచర్లతో విడుదల కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

Lumia 1020 Price: HMD గ్లోబల్ నుంచి  దిమ్మతిరిగే మొబైల్.. దీని డిజైన్ వేరే లెవెల్.. ధర, ఫీచర్స్ లీక్..

Nokia Lumia 1020 Hmd Price: మళ్లీ మార్కెట్లో నోకియా స్మార్ట్ ఫోన్లు యుగం ప్రారంభం కాబోతోంది. నోకియా తమ కంపెనీ  హెచ్ఎండి అని పేరు మార్చిన తర్వాత  కొత్త టెక్నాలజీతో అనేక స్మార్ట్ ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమయింది.. అంతేకాకుండా మార్కెట్లో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ఫోన్స్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది అలాగే అత్యంత శక్తివంతమైన స్మార్ట్ ఫోన్స్‌ను చీప్ ధరల్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు మార్కెట్‌ను షేక్ చేసిన లూమియా మోడల్ మరోసారి మార్కెట్ను దడదడలాడించబోతోంది.. అతి త్వరలోనే నోకియా తమ లూమియా సిరీస్‌ని మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి.. 

HMD గ్లోబల్  లూమియా 1020 అనే పేరుతో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఫీచర్స్‌ను కలిగి ఉండడమే.. కాకుండా ప్రత్యేకమైన డిజైన్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇందులో కంపెనీ మొట్టమొదటిసారిగా ప్రత్యేకమైన 41-మెగాపిక్సెల్ సెన్సార్‌ తో కూడిన కెమెరాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు కొన్ని ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతోంది. హెచ్ఎండి  గ్లోబల్ లూమియా 1020 మార్కెట్లోకి విడుదలయితే యాపిల్ ప్రో సిరీస్ మొబైల్స్‌కు పోటీగా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ  స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

లూమియా 1020 స్మార్ట్ ఫోన్ ఎన్నో ప్రత్యేకమైన సెన్సార్లతో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ప్రత్యేకమైన  2/3-అంగుళాల సెన్సార్‌ను  కలిగి ఉండబోతున్నట్లు కూడా తెలుస్తోంది.. అంతేకాకుండా కార్ల్ జైస్ ఆప్టిక్స్, జినాన్ ఫ్లాష్  వంటి ఫీచర్లతో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్   ఫీచర్ కూడా  లభించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా  మొబైల్ ద్వారా ఫోటోగ్రఫీ చేద్దామనుకునే వారికి, ఇది ది బెస్ట్ మొబైల్‌గా నిలిచే అవకాశాలున్నాయి.  అలాగే ఇందులోని ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ సెన్సార్  కలిగి ఉంటుంది. అంటే ఇది  DSLR ఫోటోగ్రఫీకి సమానంగా ఉంటుంది.. అంతేకాకుండా ఈ మొబైల్లో కొన్ని  ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు కూడా  కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

ఇక HMD గ్లోబల్  లూమియా 1020 మొబైల్  బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది అత్యంత శక్తివంతమైన 4,900mAh బ్యాటరీ  కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  స్పీడ్ చార్జింగ్ కోసం 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను  కూడా అందిస్తోంది. అలాగే వైర్‌లెస్ ఛార్జింగ్ వైర్‌లెస్ మైక్రోఫోన్‌లను  కూడా కలిగి ఉంటుంది.. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను హెచ్ఎండి గ్లోబల్ అతి త్వరలోనే  వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే దీని ధర ఇటీవల లీకైన వివరాల ప్రకారం, రూ. 51,300 ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది..ఈ మొబైల్ కు సంబంధించిన వేరియంట్లను బట్టి కంపెనీ ధరను నిర్ణయించబోతున్నట్లు సమాచారం..

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More