YOUTUBE MONETIZATION: 2025, జూలై 15 నుంచి యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ పూర్తిగా మారిపోతుంది. చాలా మంది క్రియేటర్లు ఇంతవరకు ముఖం చూపించకుండా, వాయిస్ ఓవర్ లు, AI వీడియోస్ తో సంపాదిస్తూ వచ్చారు. కానీ ఈ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత అలాంటి ఛానెల్స్ చాలా ప్రమాదంలో పడ్డాయి. ముఖ్యంగా కాపీ చేసిన వీడియోలు పోస్ట్ చేసే వారికి ఇది పెద్ద షాక్ . ఇలాంటి వీడియోలను అడ్డుకోవడానికే.. యూట్యూబ్ ఇప్పుడు కొత్త పాలసీని తీసుకొచ్చింది.
అసలేంటి ఈ కొత్త రూల్స్..
తమ ఓన్ కంటెంట్ తో కష్టపడి వీడియోలు చేసే వారి కోసం యూట్యూబ్ కొత్త మానిటైజేషన్ రూల్స్ తెచ్చింది. రిపిటేడ్, రీయూజ్డ్ కంటెంట్, లో క్వాలిటీ కంటెంట్ వీడియోలు.. జులై 15 నుంచి యూట్యూబ్ లో మనకు కన్పించవు.
కొత్త రూల్స్ వల్ల ఏమవుతుంది..
యూట్యూబ్ పెట్టిన గైడ్ లైన్స్ ని పాటించని ఛానెల్స్ ని డీమానిటైజేషన్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో YouTube Partner Program నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.
మానిటైజేషన్ కు అర్హత సాధించాలంటే..
యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వాలంటే 1000 మంది సబ్ స్క్రైబర్లతో .. 12 నెలల్లో 4 వేల వాచ్ అవర్స్ పూర్తిచేసుకోవాలి. లేదంటే 10 మిలియన్ల యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ ని 90 రోజుల్లో పొందాలి.
మానిటైజేషన్ కు అనుమతించే కంటెంట్..
యూట్యూబ్ లో మీరు స్వయంగా తీసిన వీడియోలు మాత్రమే అప్ లోడ్ చేయాలి. మీ వాయిస్ తో మాత్రమే ఉండే వీడియోలని పోస్ట్ చేయాలి. కొత్త కంటెంట్ తో క్రియేటివ్ గా వీడియోలు తీయాలి.
మానిటైజేషన్ కు అనుమతించని కంటెంట్..
AI వాయిస్ తో చేసే వీడియోలతో పాటు.. వేరే వీడియోల నుంచి కట్ చేసి పెట్టిన వీడియోలను యూట్యూబ్ తక్షణమే డిలిట్ చేస్తుంది. సేమ్ టెంప్లేట్ తో రిపీట్ చేసే వీడియోలను కూడా పోస్ట్ చేయకూడదు.
మానిటైజేషన్ కు అర్హత సాధించాలంటే..
యూట్యూబ్ లో మానిటైజేషన్ అవ్వాలంటే 1000 మంది సబ్ స్క్రైబర్లతో .. 12 మంత్స్ లో 4 వేల వాచ్ అవర్స్ పూర్తిచేసుకోవాలి. లేదంటే 10 మిలియన్ల యూట్యూబ్ షార్ట్స్ వ్యూస్ ని 90 రోజుల్లో పొందాలి.
ఛానెల్ డిలిట్ కాకుండా ఉండాలంటే..
మీ ఓన్ వాయిస్ తో పాటు మీ ముఖం చూపిస్తూ వీడియోలు చేయండి. వేరే ఛానెల్ కంటెంట్ కాపీ చేయకుండా క్రియేటివ్ గా వీడియోలు తీయండంతో పాటు.. ఆడియెన్స్ కి ఉపయోగపడే సమాచారం మాత్రమే ఇవ్వండి. అలాగే రెగ్యులర్ గా వీడియోస్ అప్ లోడ్ చేస్తూ ఉండండి.
Also Read : జూలై 16న యెమెన్‌లో నిమిష ప్రియకు ఉరితీత.. కాపాడలేని స్థితిలో భారత్, ఒక్క ఛాన్స్..!
Also Read : వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే కడతేర్చిన కూతురు.. సెకండ్ షో వెళ్లి, సినిమాలకు మించిన ట్విస్టులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook