Home> తెలంగాణ
Advertisement

New Wine Industry: డ్రింకర్స్‌కు మాంచి కిక్కు ఇచ్చే వార్త.. తెలంగాణలో భారీ వైన్‌ పరిశ్రమ

Largest Wine Industry In Hyderabad: ఇది మందుబాబులకు మాంచి కిక్కు ఇచ్చే వార్త. విదేశాల్లో లభించే అత్యంత నాణ్యమైన మందు తెలంగాణలో లభించనుంది. ఇక్కడే ద్రాక్ష పంట సాగు చేసి ఇక్కడే మద్యం తయారు చేయబోతున్నారు. ఆ వార్త విశేషాలు ఇలా ఉన్నాయి.

New Wine Industry: డ్రింకర్స్‌కు మాంచి కిక్కు ఇచ్చే వార్త.. తెలంగాణలో భారీ వైన్‌ పరిశ్రమ

Wine Industry: మాంచి కిక్కు ఇచ్చే విదేశీ మద్యం కావాలా? విదేశాల్లో దొరికే నాణ్యత కలిగిన మందు కావాలంటే ఇకపై హైదరాబాద్‌లో సులభంగా లభిస్తుంది. తెలంగాణలో భారీ వైన్‌ పరిశ్రమ రాబోతున్నది. దీనికి సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇక్కడే తయారు చేసి విక్రయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. త్వరలోనే ఆ పరిశ్రమ ఏర్పాటు జరిగి మందుబాబులకు అందుబాటులోకి రానుంది. ఆ విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: Passport Lose: విదేశాల్లో పాస్‌పోర్టు పోయిందా? కంగారుపడకుండా ఈ పద్ధతులు పాటించాలి

తెలంగాణలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మరింత మద్యం విక్రయాలు పెరిగాయి. భారీ ఎత్తున ధరలు పెంచినా కూడా మద్యం విక్రయాలు తగ్గకుండా పెరిగాయి. తెలంగాణలో సీమాంధ్రులతోపాటు ఇతర రాష్ట్రాల వారు కూడా పెద్ద ఎత్తున మద్యం సేవిస్తుండడంతో తెలంగాణలో మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం.. డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఇక్కడ మద్యం పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకువస్తున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్‌ షాపులు బంద్‌.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?

కొత్త వైనరీల ఏర్పాటుకు మూడు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో ఒక దానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌శాఖ వైనరీ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల వైన్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి జూపల్లి సమక్షంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగినట్లు తెలిసింది. ఎక్సైజ్‌ శాఖ పంపిన నివేదికను పరిశీలించాక..వైనరీ ఏర్పాటుకు త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Also Read: D Mart Salaries: డీమార్ట్ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుందో తెలుసా?

ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలోనే వైన్‌ తయారీ పరిశ్రమలు స్థాపిస్తే వైన్‌ ఉత్పత్తి పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతోందని భావిస్తోంది. ద్రాక్ష, ఆపిల్‌, అరటి, ఉసిరి, పైనాపిల్‌ వంటి పండ్లతో వైన్‌ తయారీకి అవకాశం ఉండటంతో భవిష్యత్తులో ఆయా పండ్ల తోటల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వాలు భారీగా రాయితీలు ఇస్తుండటంతో వైన్‌ తయారీ పరిశ్రమల ఏర్పాటుపై ఆసక్తి ఏర్పడుతోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో 700 ఎకరాలకు పైగా ద్రాక్షతోటలు ఉండడంతో అక్కడ కొత్తగా వైన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో కొత్తగా వైనరీని స్థాపించడానికి బ్లూసీల్‌, ఈరియా, బగ్గా కంపెనీలు ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తులు చేశాయి. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వం త్వరలోనే ఈ పరిశ్రమ ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read: Employees Gift: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ కానుక.. ఆ సేవ మరో ఏడాది పొడిగింపు

ఎక్సైజ్‌శాఖ లెక్కల ప్రకారం వైన్‌ విక్రయాలు
==> జనవరి నుంచి జూన్‌ వరకు రూ.300 కోట్ల విలువైన మద్యం విక్రయం. మొత్తం 2,67,245 కార్టన్ల వైన్‌ విక్రయం
==> 2021-22లో రూ.201 కోట్ల విలువైన 1.87 లక్షల వైన్‌ కేసులు విక్రయం
==> 2022-23లో రూ.260 కోట్ల విలువైన 2.35 లక్షల కేసులు విక్రయం
==> 2023-24లో రూ.275 కోట్ల 2.41 లక్షల వైన్‌ కేసులు విక్రయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Read More