Home> తెలంగాణ
Advertisement

Amrapali kata: డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలీకి భారీ గుడ్ న్యూస్.. క్యాట్ కీలక ఉత్తర్వులు..తెలంగాణలో కీలక పోస్టు..?..

Amrapali kata: ఐఏఎస్ ఆమ్రపాలీకి క్యాట్ లో భారీ ఊరట లభించింది. ఈ క్రమంలో ఎన్నోరోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తున్న అధికారిణికి ఇది గుడ్ న్యూస్ గా చెప్పుకొవచ్చు.

Amrapali kata: డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలీకి భారీ గుడ్ న్యూస్.. క్యాట్ కీలక ఉత్తర్వులు..తెలంగాణలో కీలక పోస్టు..?..

Ias Amrapali again allotted to Telangana state: ఆంధ్ర ప్రదేశ్ లో పర్యాటక శాఖలో ఎండీగా పనిచేస్తున్న ఆమ్రపాలీ కాటకు క్యాట్ లో బిగ్ రిలీఫ్ దొరికింది. మళ్లీ తెలంగాణకు కేటాయిస్తు క్యాట్ కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఆమ్రపాలీ కాట.. తెలంగాణలో జీహెచ్ఎంసీ కమిషర్ గా పనిచేస్తున్న ఆమ్రపాలీ కాట అనూహ్యంగా డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీ క్యాడర్ కు బదిలీపై వెళ్లారు.

అక్కడకు వెళ్లిన ఆమ్రపాలీ కాటకు చంద్రబాబు ప్రభుత్వం పర్యాటక శాఖలో కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో టూరిజం డెవలప్ మెంట్ కోసం ఆమ్రపాలీ కాట తనదైన మార్క్ చూపించారు. అయితే.. తెలంగాణలో పనిచేస్తానని ఆమ్రపాలీ కాటు గతంలో ఆమ్రపాలితో పాటు.. పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు.. క్యాట్ ను ఆశ్రయించారు.

ఈ క్రమంలో తాజాగా.. ఆమ్రపాలీకి మాత్రం మరల తెలంగాణ క్యాడర్ ను కేటాయిస్తు క్యాట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఐఏఎస్‌ అధికారి ఆమ్రపాలి కాటకు క్యాట్‌లో ఊరట కలిగింది. గతంలో ఆమ్రపాలీ కాట జీహెచ్ఎంసీ కమిషర్ గా పనిచేసినప్పుడు హైదరాబాద్ మొత్తం తనదైన మార్క్ చూపించారు.

అంతే కాకుండా.. వర్షాలు కురిసినప్పుడు ఆమ్రపాలీ కాట.. సామాన్యుల మాదిరిగా రోడ్ల మీదకు వెళ్లి మరీ వారి సమస్యల్ని అడిగి మరీ తెలుసుకునే వారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఆమ్రపాలీ అంటే మంచి అధికారిని అని ఒక గుర్తింపు ఉంది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మర్యాద పూర్వకంగా ఆమ్రపాలీ కలిశారు.

Read more: Indian Railways fares: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. టికెట్ చార్జీలు పెంచిన ఇండియన్ రైల్వేస్.. ఎప్పటి నుంచంటే.?..

మరోవైపు ప్రస్తుతం తెలంగాణ క్యాడర్ కు బదిలీ అయిన ఆమ్రపాలీకి రేవంత్ రెడ్డి పేషిలో కీలక పోస్టు ఇవ్వనున్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ఈ క్రమంలో  యంగ్, డైనమిక్ అధికారిణి అయిన ఆమ్రపాలీకి  ఎలాంటి పోస్ట్ ఇస్తారనేదానిపై సస్సెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More