CM Revanth Reddy on Betting App Promotions: బెట్టింగ్ యాప్స్ వివాదంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. పలువురిని విచారణకు కూడా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన స్పష్టం చేశారు. గుట్కా, నిషేధిత పదార్ధాలు ఇంకా అమ్ముతున్నారని తమ దృష్టికి వచ్చిందని.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రోత్సహించినా.. ప్రకటనలు ఇచ్చినా సైబర్ నేరాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"నేరం అనేది ఎవరూ చెప్పి చేయరు. MMTS రైలులో జరిగిన సంఘటన రైల్వే పోలీసుల పరిధిలో ఉన్నా.. మేము రాష్ట్ర ప్రభుత్వం తరపున స్పందించాము. నడి బజారులో హైకోర్టు న్యాయవాదిని నరికి చంపితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలిక రేప్ కేసులో BRS నాయకుడు కుమారుడు ఉన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిందితులను కాపాడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే అపోహలు కల్పించి ప్రధాన ప్రతిపక్షం పెట్టుబడులు రాకుండా చేస్తోంది. ఇది సమంజసం కాదు.
మేము శాంతిభద్రతలు కాపాడుతున్నాము కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణ కుప్పకూలాలని ఆలోచనతో కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని దివాళా తీయించి అధికారంలోకి వస్తారా..? బీఆర్ఎస్ పార్టీకి సోషల్ రెస్పాన్సిబులిటీ లేదు. కేవలం పొలిటికల్ రెస్పాన్సిబులిటీ మాత్రమే ఉంది. ఎప్పుడూ మేమే అధికారంలో ఉండాలని బీఆర్ఎస్ ఆలోచన. భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష నేతగా భట్టి మీకు మంచి సలహాలు,
సూచనలు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంత ఆవేదన చెందినా ఎన్నికలు వచ్చే సంవత్సరం రావు. ఒకాయన ట్విట్టర్‌లో పెడితే మరొకాయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తారు. ఒకరికి ఒకరు పోటీ పడి టిక్కెట్లు పంచుతున్నారు. సభా నాయకుడిగా ప్రతి ఎమ్మెల్యేకు అందుబాటులో ఉంటాను. గజ్వేల్, సిద్దిపేట ఎమ్మెల్యేలు వచ్చినా సీఎంగా అందుబాటులో ఉంటాను.
పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత బీఆర్ఎస్ వాళ్లకు కనువిప్పు కలగాలి. ప్రభుత్వాన్ని బద్నాం చేయడం మీ విధానామా..? మేము ఊదరగొట్టే బడ్జెట్‌ను మేము పెట్టలేదు. భట్టి బడ్జెట్ 95 శాతం నిజం కాబోతోంది. సెంట్రల్ యూనివర్సిటీ లాండ్ విషయంలో కొన్ని గుంట నక్కలు చేరాయి. గుంట నక్కలకు గుణపాఠం చెప్తాము" అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Raw Banana: పచ్చి అరటికాయ తింటే ఈ రోగాలు ఫసక్.. ఆ జబ్బులు జన్మలో రావు..
Also Read: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. విచారణ చేయాలని డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.