Daughter Killed Father: కాయ కష్టం చేసి కని పెంచి పిల్లల్ని ఏ ఇబ్బందులు పడకుండా పెంచుతాడు తండ్రి. అందులో కూతురు అంటే తండ్రికి ఎంతో ఇష్టం. కన్నతండ్రి అంటే కూతురు కూడా మమకారం. అయితే తన వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా కన్న తండ్రిని కడతేర్చిందో కూతురు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి ఘట్ కేసర్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్ కవాడీగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లురీ లింగం (45) ఈ నెల 7న ఎదులబాద్ చెరువులో శవమై తేలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి వెళ్లి ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే అనుమానాస్పదంగా మృతదేహం ఉండటంతో అతడి కుటుంబ సభ్యులను గుర్తించారు. అయితే లింగం భార్య శారద, కుమార్తె మనిషా (25) గా గుర్తించారు. ఇక పోలీసులు దర్యాప్తు చేయగా తన తండ్రి 6వ తేదీనే కనిపించకుండా పోయినట్లు తెలిపారు. ఆయనకు బాగా కల్లు తాగే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలో అందరితో గొడవ పడేవాడని వాళ్ళు బుకాయించారు. అయితే సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షించిన పోలీసులు తల్లి కూతుళ్ల అసలు రంగు బయటపడడంతో తనదైన స్టైల్ లో విచారించారు. ఇక చివరికి అసలు విషయం బయటపడింది.
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని..
అయితే లింగం తన వివాహేతర బంధానికి అడ్డుగా మారాడు అని ఇష్టం వచ్చినట్లుగా తనను తిడుతున్నాడని కూతురే ఈ హత్యకు పథకం వేసింది. లింగం పాతబస్తీలోనే అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య జిహెచ్ఎంసి స్వీపర్ వీళ్ళకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందులో పెద్ద కూతురు మనిషాకు పెళ్లి విడాకులు అయ్యాయి. వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసి భర్త వదిలేసాడు. ఇక మనిషా కు జవహర్ నగర్ కి చెందిన మహమ్మద్ జావిద్ (24) వివాహేతర బంధం సాగుతుంది.
భర్త విదిలేయడంతో మౌలాలిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని అతనితోనే వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది చూసిన తండ్రి లింగం కూతురుతో గొడవపడ్డాడు. పలుమార్లు ఆమె తీరు మార్చుకోమని తిట్టాడు. అయితే తన వివాహేతర సంబంధానికి తండ్రి అడ్డుగా మారారని పగ పెంచుకుంది కూతురు. అదే సమయంలో తల్లి కూడా తనను వివాహేతర సంబంధం ఉందని నన్ను అనుమానిస్తున్నాడని కూతురికి చెప్పింది.
ఈనెల 5వ తేదీన ఇద్దరు కలిసి పెద్ద పథకమే వేశారు. దానికి ప్రియుడు జావిద్ కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తల్లికి నిద్ర మాత్రలు ఇచ్చింది మనిషా. శారద తన భర్తకు కల్లులో కలిపి తాగించింది. ఈ నేపథ్యంలో ఆయన స్పృహ కోల్పోయాడు. అప్పుడు ఈ ముగ్గురు కలిసి అతని ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఏం తెలియనట్టుగా సెకండ్ షో సినిమాకు వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసి ఇద్దరు మళ్ళీ తిరిగి వచ్చి క్యాబ్ బుక్ చేశారు. మృతదేహాన్ని కార్ ఎక్కించే సమయంలో డ్రైవర్ కూడా అనుమానం వేస్తే తాగాడు మత్తులో ఉన్నాడని బుకాయించారు. ఎదులాబాద్ వద్దకు వెళ్లి అక్కడ చెరువులో లింగం మృతదేహాన్ని పడేశాడు.
వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. కన్నతండ్రి తల్లి కూతురు కొడుకు అనే తేడా లేదు ఆ ప్రాణాలు తీయడానికి కూడా దిగజారుతున్నారు. రాను రాను సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అనే ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధం కోసం భర్తలను చంపే భార్యల కేసులు ఎక్కువయ్యాయి.
Also Read :టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. మోదీ సంతాపం, 32 మంది మృతి వీడియో వైరల్
Also Read :'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌కు లైన్ క్లియర్.. ట్రంప్ మేజర్ లెజిస్లేటివ్ విక్టరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook