KCR Health Update: అనారోగ్యానికి గురయిన బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకున్నారు. ఈ విషయాన్ని గులాబీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. విశ్రాంతి తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నాయకత్వంతో తెలంగాణ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా నదీ జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంపై చర్చిస్తున్నారు. వారం రోజులుగా పార్టీ నాయకులతో గులాబీ అధినేత వరుస చర్చలు చేస్తున్నారు. అనారోగ్యం నుంచి కోలుకున్న కేసీఆర్ మరోసారి ఆస్పత్రికి వెళ్లనున్నారు.
Also Read: Passport Lose: విదేశాల్లో పాస్‌పోర్టు పోయిందా? కంగారుపడకుండా ఈ పద్ధతులు పాటించాలి
ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జయిన మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో విశ్రాంతి పొందుతున్నారు. ఐదు రోజులుగా పార్టీ నాయకులతో బిజీగా గడుపుతున్నారు. తనను పరామర్శించడానికి వచ్చిన పార్టీ సీనియర్లతో నాటి తెలంగాణ ఉద్యమకారులతో చర్చలు చేస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న సమస్యలు, పలు అంశాల మీద సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకాలం నాటి అనుభవాలను వారితో స్మరించుకుంటున్నారు.
Also Read: Wine Shops Close: తెలంగాణలో వైన్ షాపులు బంద్.. ఎప్పుడు? ఎందుకో తెలుసా?
'తెలంగాణ కోసం సాగిన ఉద్యమంలో నాటి తెలంగాణ పరిస్థితి ఎట్లుండే.. అనంతరం బీఆర్ఎస్ పార్టీ తొలి ప్రభుత్వ పదేండ్ల హయాంలో ఎంత గొప్పగా తెలంగాణ రాష్ట్రం ప్రగతిని సాధించింది' అనే విషయాలను పార్టీ నాయకులతో అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నేటి కాంగ్రెస్ పాలనతో పోల్చి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అన్ని రంగాల్లో అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారని.. పాలన పూర్తిగా అదుపు తప్పిందని కాంగ్రెస్ వైఫల్యాలను కేసీఆర్ వివరించారు.
Also Read: D Mart Salaries: డీమార్ట్ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుందో తెలుసా?
తెలంగాణ రాష్ట్రం తిరిగి మళ్లీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలన మాదిరి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి పార్టీ నాయకులు తీసుకెళ్లారు. వారం రోజుల చర్చల్లో క్షేత్రస్థాయి అనుభవాలను వాస్తవాలను ప్రజల అభిప్రాయాలను ముందుకు తెచ్చారు. వరి నాట్లకు సిద్ధమైన రైతులను ఆదుకునే నాథుడే లేడని పార్టీ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌కు వివరించారు. అదునుకు పదును అందక సరైన సమయానికి యూరియా, సాగునీరు అందక రైతులు పడుతున్న బాధలను పార్టీ నాయకత్వాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారు.
అస్తవ్యస్థమైన పాలనలో.. కనీస వసతులు మౌలిక సదుపాయాలు కరువై.. సామాన్యులు ఎదుర్కుంటున్న సమస్యలు, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడంతో తలెత్తుతున్నసమస్యలను పార్టీ నాయకులు మాజీ సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించారు. కాంగ్రెస్ కల్లబొల్లి హామీలిచ్చి తమను మోసం చేశారనే భావన ప్రజల్లో నెలకొందని.. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కనిపిస్తే తరిమికొట్టేందుకు తెలంగాణ పల్లెలు సిద్ధంగా ఉన్నాయని పార్టీ నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌కు వివరించారు.
వారం రోజులుగా సాగిన చర్చల్లో నదీజలాల పంపిణీ, సాగునీరు, రైతుల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. గోదావరిని పరీవాహక ప్రాంతాన్ని మరోమారు ఎడారిగా మార్చే బనకచర్ల నిర్మాణంపై కేసీఆర్ చర్చల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునే దిశగా పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ముందుకు సాగుతామని పార్టీ నాయకత్వం తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook