Godavati pushkaralu 2027 scheduleed from july 23 rd to august 3: హిందూ సంప్రదాయంలో పుష్కరాలకు ఎంతో ప్రధాన్యత ఉంది. ఇటీవల సరస్వతి పుష్కరాలు సందడి ముగిసింది. బృహస్పతి ఏ రాశిలో అంటే దాని ఆధారంగా ఆయా నదులకు పుష్కర వేడుకలను జరుపుతారు. దేవ గురువు బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశించే సమయంలో గోదావరినదికి పుష్కరాల ప్రారంభమౌతాయి.. ఈసారి మనం.. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించుకోబోతున్నాం.
పుష్కరాలు ప్రతి పన్నెండు ఏళ్లకు ఒక సారి వస్తాయి. ఈకాలంలో ఆయానదుల్లో దేవతలు వచ్చి నివాసం చేస్తారని, ఆ సమయంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే పుణ్యం ప్రాప్తిస్తుందని, పూర్వీకులకు శ్రాద్దకర్మాలు చేయిస్తే.. వారికి పుణ్యలోకాలు ప్రాప్తించడంతో పాటు.. వారి సంతానానికి మంచి జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు.
ఈ నేపథ్యంలో.. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే.. గతంలో 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.
గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్దం చేసింది. అంతేకాకుండా.. కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది. పుష్కరాలకు రెండు తెలుగు రాష్ట్రాలు సైతంప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాయి.
తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామంటున్న రైల్వే అధికారులు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.