Home> తెలంగాణ
Advertisement

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. రేవంత్‌ రెడ్డినే కొరడా దెబ్బలు కొట్టాలి

Harish Rao Slams To Revanth Reddy Hate Speech: ప్రజా భవన్ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న రేవంత్‌ రెడ్డిని.. కాంగ్రెస్ పార్టీని కొరడా దెబ్బలు కొట్టాలని పేర్కొన్నారు.

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. రేవంత్‌ రెడ్డినే కొరడా దెబ్బలు కొట్టాలి

Harish Rao vs Revanth Reddy: కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి ప్రదర్శిస్తున్నారని రేవంత్‌ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు పిలిచే దమ్ములేకనే ప్రజా భవన్‌లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యావని తెలిపారు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల ప్రీవిలేజ్ భంగం కల్పించడంతో శాసనసభ, శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని సంచలన ప్రకటన చేశారు.

Also Read: KCR Health: కుదుటపడ్డ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం.. నదీ జలాలపై ఆందోళన

'పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పక్కన బెట్టి అబద్దాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క పనికి రాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: Passport Lose: విదేశాల్లో పాస్‌పోర్టు పోయిందా? కంగారుపడకుండా ఈ పద్ధతులు పాటించాలి

'నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలతో.. తప్పుడు మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసిందేం లేదు' మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడానికి ఇంత నీచమైన స్థాయికి దిగజారుతారా? అని ప్రశ్నించారు. మీ అబద్దాలను చూసి యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని తెలిపారు. చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్దమే అని అసెంబ్లీ లోపల, బయట అనేక సార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించినట్లు గుర్తుచేశారు.

Also Read: D Mart Salaries: డీమార్ట్ ఉద్యోగులకు జీతం ఎంత ఉంటుందో తెలుసా?

'కుక్క తోక వంకర అన్నట్లు పదే పదే చెప్పిన అబద్దాలు చెబుతూ నిజాలుగా భ్రమింపచేసే కుట్రలకు పాల్పడుతుండటం సిగ్గుచేటు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ వాదులు బయట ఉంటే.. తెలంగాణ ద్రోహులంతా ప్రజా భవన్‌లో చేరి అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేశారని వివరించారు. '50 ఏళ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

'పదవుల కోసం పెదవులు మూసుకొని ఆంధ్రాకు దాసోహం అన్నది నాటి మంత్రులుగా ఉన్న నేటి మంత్రులు. ఇప్పుడు మళ్లీ అదే రీతిలో ఆంధ్రాకు నీళ్ల తరలింపులో కాంగ్రెస్ పార్టీ తోడ్పాటు అందిస్తోంది' అని హరీశ్‌ రావు చెప్పారు. అప్పుడు, ఇప్పుడూ ఎప్పుడూ రేవంత్‌ రెడ్డిది ద్రోహ చరిత్రనే అని తెలిపారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు నేడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నావు అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిందని పచ్చి అబద్దాలు చెబుతున్న రేవంత్ రెడ్డి దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు అని సవాల్‌ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మూలన పడిందని గుర్తుచేశారు.

'బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికార భవన్‌లో అధికారికంగా నిర్వహించిన నేటి సమావేశానికి మీ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులను మాత్రమే ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సాగునీటిపై చర్చకు రా అంటూ రంకెలు వేసే రేవంత్ రెడ్డి.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎందుకు పిలవలేదు అని ప్రశ్నించారు. 'నీ సవాల్‌లో నిజాయితీ ఉంటే ఎందుకు ప్రజా భవన్‌కు ఆహ్వానించలేదు. ఇది ఎమ్మెల్యేల ప్రివిలేజ్‌కు భంగం కల్పించడమే' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Read More