Hyderabad police case filed on betting app promoters: కొన్నిరోజులుగా బెట్టింగ్ యాప్ ల పడి అనేక మంది అమాయకులు తమప్రాణాలు కోల్పోతున్నారు. మొదట ఈజీగా డబ్బులు ఇస్తున్నట్లు చేసి.. ఆతర్వాత వారిని వేధింపులకు లోన్ యాప్ నిర్వహకులు పాల్పడుతున్నారు. వీరి వేధింపులు తాళలేక.. చాలా మంది అమాయకులు తమ ప్రాణాలను సైతం కొల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెట్టింగ్ యాప్ ఘటన తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై తాజాగా.. హైదరబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడంపై సీరియస్ అయ్యారు. అదే విధంగా చాలా మంది యూట్యూబర్లు, నటీనటులు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ లు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వీరిలో.. విష్ణు ప్రియ, సుప్రీత, రీతూ చౌదరీ, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్, ఇమ్రాన్ , కిరణ్ గౌడ్, యాంకర్ శ్యామల, బండారు పేషయానీ తదితరులపై పంజాగుట్ట పొలీసులు కేసుల్ని నమోదు చేశారు.
Read more: Viral Video: కాలేజీలో కామాంధుడు.. అమ్మాయిలను మభ్యపెట్టి రాసలీలలు.. వీడియో వైరల్..
కొన్నిరోజులుగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులపై సీరియస్ గా చర్యలు తీసుకొవాలని కూడా డిమాండ్ చేస్తు వస్తున్నారు.ఈ క్రమంలో పోలీసులు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసిన వారికి మాత్రం చుక్కలు చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter