MLC Kavitha:కొంతకాలంగా బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. తనకు కేసీఆర్ తప్పా మరో నాయకుడు లేడన్నా కామెంట్స్ బీఆర్ఎస్ లో చర్చకు దారితీశాయి. ఆమె ప్రధానంగా తన సోదరుడు కేటీఆర్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ అభిమానులకు కవిత కామెంట్స్ రుచించడం లేదు.. ఈ నేపథ్యంలోనే కల్వకుంట్ల కవిత ఖమ్మం పర్యటన హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ చనిపోవడంతో ఆయన కుటుంబాన్ని కవిత పరామర్శించారు. ఆ సమయంలో కవితా వెంట ఒక్కరంటే ఒక్కరూ బీఆర్ఎస్ లీడర్లు కనిపించలేదు. జిల్లాలో ప్రధాన నాయకులుగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, కమల్ రాజ్, రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర కవిత వైపు కనీసం కన్నెత్తి చూడలేదు. అంతకు ముందు ఆ నేతల్లో ఒకరిద్దరు జిల్లాలో ఉన్నా కవితను మాత్రం పట్టించుకోలేదు. మాజీ సీఎం కూతురు, పైగా పార్టీ ఎమ్మెల్సీ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చిన పట్టించుకోకపోవడంతో కవితాను పార్టీనే దూరం పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. అయితే పార్టీ ఆదేశాలు అనే కంటే కేటీఆర్ ఆదేశాలతో కవితా పర్యటించినా ఖమ్మం నేతలు దూరంగా ఉండటం మాత్రం కొత్త చర్చకు దారీతీస్తోంది..
ఇదిలా ఉంటే.. కల్వకుంట్ల కవిత చాలా దూకుడుగా వెళ్తున్నారు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న కవితకు బీఆర్‌ఎస్ పార్టీలోని కొందరు బీసీ నేతలు మద్దతు పలుకుతున్నారు. ఇతర ఏ సామాజిక వర్గ నేతలు మాత్రం కవితను పట్టించుకోవడం లేదు. దీంతో కవితా కొత్త పార్టీ ఎమైనా ఆలోచన చేస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ విషయాన్ని బీసీ నేతలకు ఎమైనా చెప్పిందా..? అందుకే వారు మాత్రమే కవితాకు వెన్నుదన్నుగా నిలిచారా..? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ఇప్పటికే జాగృతి బలోపేతం కోసం కృషి చేస్తానని చెబుతూ.. ఆ సంస్థనే పార్టీగా అనౌన్స్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒక్క బీసీ నేతలే ఆమె వెంట కనిపించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. గతంలో కూడా కవితా జిల్లాలో పర్యటించిన సమయంలో ఆ పార్టీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి దాన్ని మెయింటెన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చెప్పినంత ఈజీ కాదు. ఓ పార్టీని పెట్టి దాన్ని రన్ చేయడం అంటే.
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన లీడర్లు అంతా కేటీఆర్ కనుసన్నల్లో పనిచేసే వారనే టాక్ ఉంది. కవితా పర్యటనకు సంబంధించి ఎవరూ కూడా హాజరు కావద్దని జిల్లా నేతలకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే జిల్లా పర్యటనలో ఈ అంశాలు అన్ని గమనించిన కవితా ఆ లీడర్లు వ్యవహార తీరును ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న తన పర్యటనలో ఆ నేతలు హాజరు కాకపోవడం పట్ల ఆమె అసహన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తనకు జరుగుతున్న అవమానాలను అన్నీ సమయం చూసుకుని కేసీఆర్ కు చెబుతానని కవితా సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం..
ఏది ఎమైనా రెండు సార్లు జిల్లాలో పర్యటించిన కవితకు ఆ పార్టీ నేతలు డుమ్మా కొట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట.. తాను ఇంకా గులాబీ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నా.. ఆ లీడర్లు ఎందుకు తనకు టచ్‌లోకి రావడం లేదని గుస్సా అవుతున్నారట. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవని.. తన టైమ్ వచ్చిన్నప్పుడు తన పవర్ ఏంటో చూపిస్తానని తన అనుచరుల దగ్గర వాపోతున్నారట.. మొత్తంగా ఖమ్మంలో కవిత పర్యటన మాత్రం కాకరేపుతుండగా.. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో చూడాలంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.
(రచయత - గుర్రం శేఖర్ - తంజావూర్ కిరణ్ కుమార్ శర్మ )
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.