MLC Kavitha Coments: ఎమ్మెల్సీ కవిత మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. BRSను బీజేపీలో కలపాలని చూస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీలో పార్టీని విలీనం చేయవద్దని చెప్పానని తెలిపారు. తనకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ నేతలు.. తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలన్నారు. కేసీఆర్ నీడలో పని చేస్తున్న వాళ్లు.. తనపై ప్రతాపం చూపిస్తున్నారని విమర్శించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు చేయడం రాదన్నారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని కవిత ప్రశ్నించారు. తాను రాసిన లేఖను బయట పెట్టింది ఎవరో తేల్చాలన్నారు. కేసీఆర్‌లానే తాను ఎవరికి భయపడేది లేదని కవిత తేల్చి చెప్పారు.
"నాకు నీతులు చెబుతున్న బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణకు జరుగుతుననా అన్యాయంపై ఫైట్ చేయాలి. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తుంటే ఎవరు స్పందించారు..? నా మీద పడి ఏడిస్తే ఏం లాభం. లేఖల లీకులు చేస్తున్న వారిపై చర్యలు లేవు. నాపై లిక్కర్ కేసు అంశం వచ్చినప్పుడు.. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కేసీఆర్ దగరికి వెళ్లాను. కానీ నాన్న అవసరం లేదు అన్నాడు. అందుకే కంటిన్యూ అయ్యా. ఎంపీగా పోటీ చేసినప్పుడు నాపై కొందరు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ఓడిపోయినా జాగృతిని సొంత డబ్బుతో నడిపిస్తున్నా.. వాళ్ల డబ్బులు తీసుకోలేదు. నన్ను విమర్శించేవాళ్లు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నారు.
కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే ఎక్కడ పోయారు..? ఎవరు ఆందోళన చేయడం లేదు. లీక్ వీరులను బయట పెట్టకుండా గ్రీక్ వీరుల్లాగా ఎగిరిపడుతున్నారు. నేను వందల లెటర్స్ రాశా.. అందులో తప్పేముంది..? తెలంగాణ సోయితో పనిచేయడం లేదు? కొందరు కేసీఆర్ కింద ఉన్నవాళ్లు సరిగ్గా పనిచేయడం లేదు. స్వంత బిడ్డపై మీ ప్రతాపం ఏంటి..? బయట వాళ్లపై ఎందుకు మాట్లాడటం లేదు. ఇదేనా పార్టీని నడిపించడం..? సభను సక్సెస్ చేసింది కేసీఆర్ మాత్రమే.. ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. గంపగుత్తగా బీజేపీకి అంట గట్టేలాగా వ్యవహారం చేస్తున్నారు. బీజేపీ కోవర్టులు మనదాంట్లో ఎవరు ఉనారు..? నేను పదవి అడగలేదు. పైసలు అడగలేదు. వెన్నుపోటు రాజకీయం చేయను. చేయలేదు. కాంగ్రెస్ బాగుంటే రాహుల్ బాగుంటే బీజేపీ ఇన్నిసార్లు గెలవదు. వాళ్ల పరిస్థితినే బాగా లేదు. వర్కింగ్ ప్రసిడెంట్ వ్యతిరేకంగా పోవడం లేదు. ఆయన పోస్ట్‌కు ఉండే గౌరవం ఉంటుంది. మాకు కేసీఆర్ తప్ప మరో లీడర్ లేడు." అంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: Bakrid 2025: ఇండియాలో జూన్ 7న బక్రీద్ పండుగ, ప్రాముఖ్యత ఏంటి
Also Read: Gaddar cine Awards 2025: తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్.. ఉత్తమ చిత్రం కల్కి.. నటుడు అల్లు అర్జున్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి