lack of rainfall in Telangana : రాష్ట్రంలో వానల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ మొదటి వారంలో పడిన వానలు ఆ తర్వాత ముఖం చాటేశాయి. దాదాపు మూడు వారాలుగా రాష్ట్రంలో పెద్దగా వర్షాలు పడలేదు. వానల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అక్కడక్కడా చెదురు మదురు వానలు పడినా.....కుంటలు,చెరువుల్లోకి నీళ్లు రాలేదు. దీంతో పంటలు ఎండుతున్నాయి. తెలంగాణలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 50శాతం లోటు వర్షపాతం నమోదు అవ్వగా...అన్ని జిల్లాల్లో దాదాపు 20నుంచి 40శాతం లోటు వర్షపాతం రికార్డ్ అయ్యింది. ఋతుపవనాల ఆగమంతో మే చివరి వారం.. జూన్ మొదటి వారంలో భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు ఎంతగానే సంతోషం వ్యక్తం చేవారు. ఏరువాక పున్నమికి ముందే కొంత పంట వేయడానికి మొగ్గు చూపారు. కానీ ఆ తర్వాత రాను రాను వర్షాలు పడ్డా అనుకున్నంత రేంజ్ లో పడలేదు. దీంతో రైతులు వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ కృష్ణా పరివాహాక ప్రాంతాల్లో మంచి వర్షాలు పడుతున్నాయి. అవి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కేవలం కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడుతున్నాయి.
ఓవైపు ప్రాజెక్టులు కళలాడుతున్నా.. తెలంగాణలోని పలు ప్రాంతాల రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి ప్రాంతాల్లో వర్షాలు పడటం లేదు. అయితే ప్రాజెక్టుల నుంచి నీరు ఉన్నా.. సహజంగా కురిసే వానలతో పంటలకు ఎక్కువ లాభం ఉంటుంది. మరి సీజన్ చివరి వరకు మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు పడితే సరి లేకపోతే.. కొన్ని ప్రాంతాల్లో అనావృష్టితో రైతాంగం నష్టపోయే అవకాశాలే ఎక్కువున్నాయి.
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం పెరిగింది. కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకుతూ గోదారమ్మ ఉరకలేస్తోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, 5 లక్షల 25 వేల క్యూసెక్కులుగా ఉంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ 85 గేట్లు ఎత్తి ఉంచడంతో నీరు మొత్తం దిగువకు వెళుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 9.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 13 మీటర్లు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే గోదావరిలో వస్తున్న ప్రవాహం అంతా ప్రాణహిత నది ప్రవాహమే. మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో ప్రాణహిత నది ప్రవహిస్తోంది. ప్రాణహిత నది ప్రవాహం కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలవడం వల్ల గోదావరి నదికి జలకళ వచ్చింది. ఎగువన గోదావరి నదిలో మాత్రం ప్రవాహం లేదు.
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.