Pushpa 2 rappa rappa dialogue flexi halchal in brs harish rao meeting: ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ పల్నాడు పర్యటనలో పుష్ప2 రప్ప..రప్పా.. డైలాగ్ ఫ్లెక్సీలు హల్ చల్ చేశాయి. తాము అధికారంలోకి రాగానే.. పొట్టెలు తలల్నినరికినట్లు.. రప్పా.. రప్పా.. నరుకుడే అంటూ అందులో రాసి ఉంది. అయితే..దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ ఫ్లెక్సీని ఏర్పాడు చేసిన కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ సైతం విధించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం.. దీనిపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగింది.
సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైతం.. జగన్ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఇలా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. అయితే..ఈ రచ్చ కొనసాగుతుండగానే... తెలంగాణలో కూడా ఈ రప్పా.. రప్పా.. ఫ్లెక్సీ రచ్చ పాకింది.
రుణమాఫీ చేస్తామని రైతులను నిండా ముంచింది కాంగ్రెస్
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు pic.twitter.com/iQ1CbqEKdk
— Harish Rao Cults (@HarishRao_Cults) June 21, 2025
బీఆర్ఎస్ నేత హరీష్ రావు.. సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో నిర్వహించిన రైతు ధర్నాలో.. 2028 లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. రప్పా.. రప్పా.. 3.0 లోడింగ్ అంటూ కొంత మంది కార్యకర్తలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనిపై తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చ ప్రారంభమైంది.
ఈ క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టారని అన్నారు. అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో రైతుల్ని మోసం చేశారన్నారు. ఈక్రమంలో కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు.
Pushpa Dialogue at Harish Rao's Rally#HarishRao #AlluArjun #PushpaDialogues #BRSEvent #Patancheru #RythuDharna #TelanganaPolitics #2028Elections #PushpaStyle pic.twitter.com/El6Dkt0nY2
— Telangana Ahead (@telanganaahead) June 21, 2025
గతంలో హైకోర్టులు మొట్టికాయలు వేసిన.. వీకెండ్ లు చూసి కావాలని అరెస్ట్ చేశారని సీఎం రేవంత్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ అక్రమ కేసులకు భయపడేది లేదని.. కాంగ్రెస్ ను ఎండగడుతునే ఉంటామని కూడా హరీశ్ రావు రైతు ధర్నాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook