VRA Successor Jobs: ఉద్యోగులకు సంబంధించిన కీలక డిమాండ్‌పై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఉద్యోగుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జీఓ నెం.81 ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
Also Read: Employees Salary Hike: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపు
వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం వీఆర్‌ఏ వారసులు హైదరాబాద్ ఆబిడ్స్‌లోని భూపరిపాలన కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారి ఆందోళనకు ఆర్ కృష్ణయ్యతోపాటు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘీభావం ప్రకటించిన అనంతరం కృష్ణయ్య, రంగారెడ్డి మాట్లాడారు.
Also Read: Tomorrow Holiday: రేపు విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు.. ఎందుకో తెలుసా?
'2020లో కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో వీఆర్ఏలకు పేస్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. జీఓ నెం. 81, 85 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలలో 16,758 మంది వీఆర్ఏలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది' అని కృష్ణయ్య, రంగారెడ్డి వివరించారు. మిగతా 3,797 మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
రాజకీయ నాయకులు వారి వారసులకు అవకాశాలు కల్పిస్తున్నారని... అలాంటిది ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా సేవదించించిన వారిని విస్మరించడం సరికాదని కృష్ణయ్య, రంగారెడ్డి హితవు పలికారు. వీఆర్ఏ వారసులు ఉద్యోగం రాక ఆర్థికంగా, మానసికంగా వీఆర్ఏ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు 28 మంది వీఆర్‌ఏల వారసులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.