Raja Singh Vs Madhavi latha: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ రాజీనామా కలకలం రేపుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి తనకు దక్కకపోవడంతో రాజాసింగ్ రాజీనామా చేశారు. ఇకమీదట కమలం పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టేది లేదని తేల్చిచెప్పారు. దాంతో గోషామహాల్ నియోజకవర్గంపై కాషాయ పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాజాసింగ్‌కు ప్రత్యామ్నయ నేత ఎవరనే దానిపై పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో రాజాసింగ్‌ను బలంగా ఢీకొట్టి.. ఓవైసీ బ్రదర్స్‌కు కూడా చుక్కలు చూపించే మహిళ నేత మాధవిలతను బరిలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె అయితేనే అటు రాజాసింగ్‌కు, ఇటు ఎంఐఎం పార్టీకి చెక్ పెట్టొచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అయితే.. రాజాసింగ్.. లోకల్ తెలంగాణ నేతలనే టార్గెట్ చేస్తుననా.. మోడీ, అమిత్ షాలపై తన విధేయతను ప్రకటిస్తున్నారు. వాళ్లు కూడా రాజా సింగ్ ను బుజ్జిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు బుజ్జిగిస్తూనే ఆయనకు ప్రత్నామ్నాయంగా మరో నేతను రంగంలోకి దింపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రాజా సింగ్ వేరే బాధ్యతలు అప్పగించి ఆయన్ని పార్లమెంట్ కు పోటీ చేయించాలనే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం.. బీజేపీ మహిళా లీడర్ మాధవీలతను ఓ పావుగా వాడుకోవాలని చూస్తోంది. ఆమె పాతబస్తీలో ఓ ఫైర్ బ్రాండ్ లీడర్.. తెలంగాణ బీజేపీలో ఆమె ఎంట్రీనే ఓ సంచలనం.. భారతీయ జనతా పార్టీకి వచ్చి రాగానే ఆమె ఎంఐఎం పార్టీని టార్గెట్ చేశారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ రేసులో నిల్చుని.. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడగొట్టినంతా పనిచేశారు. ఇక ఎన్నికల ప్రచారం సమయంలో మాధవీలత ఫైర్ చూసిన కమలం పార్టీ లీడర్లు.. మాధవీలత పాతబస్తీకి కరెక్ట్ లీడర్‌గా భావించారు. భవిష్యత్తులో ఓవైసీని బలంగా ఢీకొట్టాలంటే.. మాధవీలత తోనే సాధ్యమని భావించారు. అయితే ఇప్పుడు మాధవీలతకు కమలం పార్టీ పెద్దలు మరో టాస్క్ అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో గోషామహాల్‌లో మాధవీలతకు గోషామహాల్ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీజేపీ ఉందని సమాచారం. ఇందులో భాగంగానే మాధవీలతను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక పార్టీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ సమావేశం తర్వాత పాతబస్తీలో పర్యటించారు మాధవీలత. క్యాడర్‌లో ఉత్సాహాం నింపేలా రోజంతా తిరిగారు. దీంతో సునీల్ బన్సల్ ఆదేశాలతోనే మాధవీలత ఓల్డ్‌సిటీలో పర్యటించారని చర్చ సాగుతోంది. రాజాసింగ్‌కు ప్రత్యామ్నాయంగా మాధవీలత ఉన్నారనే సిగ్నల్స్ పార్టీకి కేడర్ కు పంపిచారనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో బీజేపీకి బలమైన నేతలు క్యాడర్ ఉన్నారు. అటు రాష్ట్ర బీజేపీలో సగం మంది నేతలు హైదరాబాద్ నుంచే ఉన్నారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, ప్రస్తుత రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు లాంటి లీడర్లు భాగ్యనగరం నుంచే ప్రాతినిద్యం వహిస్తున్నారు. మరోవైపు గ్రేటర్‌లో బీజేపీకి 40 మందికి పైగా కార్పొరేటర్లు ఉన్నారు. కానీ పాతబస్తీలో కమలం పార్టీ ఎంఐఎం పార్టీని టచ్ చేయలేకపోతోంది. కానీ అక్కడ ఎంఐఎం తర్వాత రెండో స్థానంలో బీజేపీ తన ఉనికిని నిలబెట్టుకుంది. అక్కడ ఆ పార్టీకి తన కంటూ కొంత ఓటు బ్యాంక్ ఉంది. అందుకే పాతబస్తీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తోంది బీజేపీ. అక్కడ ఎంఐఎం పార్టీని ఢీకొడితే.. గ్రేటర్‌లో మంచి పట్టు వస్తుందని లెక్కలు వేసుకుంటోందట. అలాగే గోషామహాల్ బీజేపీకి సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని అనుకుంటోందట. కానీ గోషామహాల్‌లో రాజాసింగ్‌ను ఢీకొట్టి కాషాయజెండా ఎగరవేయాలంటే మాధవీలతే ప్రత్యామ్నాయని భావిస్తోందట. అందుకే మాధవీలతను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. అయితే.. రాజా సింగ్ రాజీనామాను బీజేపీ పెద్దలు ఓకే చేస్తారా అని చూడాలి.
మొత్తంమీద గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఒకవేళ ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే మాత్రం.. ఉప ఎన్నిక అనివార్యం అవుతుంది. కానీ అది అంత ఈజీ కాదు. ఒకవేళ చేస్తే ప్రత్నామ్నాయ లీడర్ గా మాధవీ లతను ఇప్పటికే రెడీగా ఉంచారు. మాధవీలత ఇప్పుడు నేరుంగా రంగంలోకి దిగడంతో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రాజాసింగ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. మాధవీలతకు బలమైన వాయిస్, మంచి ఫాలోయింగ్ ఉండటంతో తన ఎమ్మెల్యే పదవికి ఎసరు వస్తుందని భయపడుతున్నారట. ఏదీఏమైనా పాతబస్తీలో మరోసారి పాగా వేయాలంటే మాధవీలతను అస్త్రంగా బీజేపీ పెద్దలు ఎంచుకోవడం మాత్రం ఆసక్తి రేపుతోంది. మరోవైపు రాజా సింగ్ ను ఒదలుకోవద్దని బీజేపీ పెద్దలు ఉన్నారు. ఏది ఏమైనా రాజా సింగ్ వ్యవహారంతో ఇపుడ పాతబస్తీ రాజకీయాలు కాక రేపుతున్నాయి.
(రచయత- గుర్రం శేఖర్ - తంజావూర్ కిరణ్ కుమార్ శర్మ)
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.