River Water Management: బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. 'మీ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. మీ సూచనలు తెలంగాణకు ప్రయోజనం చేకూరుతాయంటే తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది' అని ప్రకటించారు. నిపుణుల అభిప్రాయం కూడా సభలో వినిపిద్దామని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలోనైనా.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనైనా చర్చిద్దామని కోరారు.
Also Read: New Wine Industry: డ్రింకర్స్‌కు మాంచి కిక్కు ఇచ్చే వార్త.. తెలంగాణలో భారీ వైన్ పరిశ్రమ
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో బుధవారం నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'మీరు శాసనసభ సమావేశాలు పెట్టాలని మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడు స్పీకర్‌కు లేఖ రాసినా మేం సిద్ధం' అని ప్రకటించారు. 'మీ హయాంలో.. మా హయాంలో తీసుకున్న నిర్ణయాలపై చర్చ పెడదాం' అని తెలిపారు. 'సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా. ఎలాంటి గందరగోళం లేకుండా.. ఎవరి గౌరవానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది' అని స్పష్టం చేశారు.
Also Read: Passport Lose: విదేశాల్లో పాస్‌పోర్టు పోయిందా? కంగారుపడకుండా ఈ పద్ధతులు పాటించాలి
'మాజీ కేసీఆర్ మీరు రండి. నిపుణులను పిలుద్దాం.. స్టేక్ హోల్డర్స్‌ను పిలుద్దాం.. అర్ధవంతమైన చర్చ పెడదాం' అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 'మీ ఆరోగ్యం సహకరించకపోతే.. తారీఖు చెప్పండి.. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు నేను, మంత్రుల బృందం వస్తాం. మాక్ అసెంబ్లీ నిర్వహిస్తాం' అని ప్రకటించారు. 'ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో జరిగే ప్రజాప్రతినిధుల సమావేశానికి వస్తాం' అని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టమని పేర్కొన్నారు. తెలంగాణ హక్కుల విషయంలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతామని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 15 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే.. ఒక ఎకరాకు నీళ్లివ్వడానికి వాళ్లు చేసిన ఖర్చు రూ.11 లక్షలు అని వివరించారు. 'కృష్ణా బేసిన్‌కు అనుకుని ఉన్న గోదావరి జలాలను రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరు తరలించకుండా ఎందుకు ఆయకట్టు తొలగించారు? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook