Telangan Congress: ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన తీరిన ర్వాత సామాజిక న్యాయ సమరభేరి అంటూ కార్యక్రమాలు నిర్వాహిస్తున్నారు. ఖర్గే ఛీఫ్ గెస్ట్ రాబోతున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షత ఈ సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు, జిల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 మందిని సమీకరించాలని దిశా నిర్దేశం చేశారు. సభ ఏర్పాట్లను మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్‌గౌడ్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ తరహా సభను మొదటిసారిగా తెలంగాణలోనే ఏర్పాటు చేస్తున్నందున.. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా విజయవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు.
కాగా గ్రామ, మండల పార్టీ అధ్యక్షులతో కలిపి దాదాపు 40 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్టేడియం లోపల భారీ టెంట్లు వేశారు. దాదాపు 220 మంది కూర్చునేలా పెద్ద వేదిక సిద్ధం చేశారు. స్టేడియం లోపల నలుదిక్కులా నాలుగు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. గ్రామాల నుంచి వచ్చిన వారికి గాంధీభవన్‌లో భోజన ఏర్పాట్లు చేశారు. జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు సమన్వయంతో పని చేసి జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయాలని పీసీసీ కోరింది. ఈ సభలో సామాజిక న్యాయం అంశంపై ఖర్గే ప్రసంగించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
ఎల్బీ స్టేడియంలో జరిగే సభకన్నా ముందు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన ఇవాళ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. వీటికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరుకానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు పాల్గొంటారు. చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం తదితర అంశాలపై చర్చిస్తారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గురువారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేశ్‌కుమార్‌గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి సీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఖర్గే పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. తొలుత కాంగ్రెస్ అసంతృప్త నేతలను బుజ్జగింఆచరు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని కాంగ్రెస్ లోని పలువురు అసమ్మతి నేతలు ఖర్గేతో భేటీ అయ్యారు. తాజ్ కృష్ణలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు , మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, బాలూ నాయక్, సుదర్శన్ రెడ్డి, ఆది శ్రీనివాస్ తదితర నాయకులు ఖర్గేతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని బుజ్జగించారని తెలుస్తోంది. అయితే ప్రేమ్ సాగర్ రావుకు ప్రభుత్వ విప్ పదవి ఇస్తామని ఈ సందర్భంగా తెలపగా.. ఆయన సమావేశం మధ్యలో నుంచే అలిగి వెళ్లిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక మల్ రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు ఒక మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనను ఖర్గె ముందు ఉఏంచారని తెలుస్తోంది. మొత్తానికి కేబినెట్ విస్తరణలో చోటు దక్కని నేతలంతా అధిష్టానంపై ఇంకా గుర్రుగానే ఉన్నట్టు సమాచారం.
Also Read : చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కలిసి నటించిన ఏకైన సినిమా తెలుసా.. !
Also Read : 16 ఏళ్ల వయసులో పెళ్లి..ఆ తర్వాత పిల్లలు..25 ఏళ్ల వయసులో విడాకులు.. ఆ తర్వాత మూవీ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.