Degree And Engineering Colleges: డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు భారీ అలర్ట్. అకస్మాత్తుగా రేపు, ఎల్లుండి సెలవులు రానున్నాయి. రెండు రోజుల పాటు సెలవులు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఉన్నఫళంగా సెలవులు ఎందుకు వచ్చాయో తెలుసుకోవాల్సి ఉంది. ఈ సెలవులు అధికారికంగా వచ్చాయా? ఎందుకు ఇచ్చారు? వరుసగా రెండు రోజులు సెలవులు రావడానికి గల కారణాలు తెలుసుకుందాం.
Also Read: Sugar Patients: షుగర్ బాధితులు గుడ్డు తినవచ్చా? తింటే ఏమవుతుందో తెలుసా?
ఇప్పుడిప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ క్రమంలోనే విద్యా క్యాలెండర్‌పై అవగాహన పెంచుకోవాల్సి ఉంది. సిలబస్, పరీక్షలు, సెలవులు అనే విషయాలు తెలుసుకుంటే ప్రణాళికగా చదువు ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో చదువుతోనే కాకుండా సెలవులపై కూడా అవగాహన ఉంటే వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చు. అయితే సెలవులు అప్పుడప్పుడు అకస్మాత్తుగా కూడా వస్తుంటాయి. అలాంటిదే తెలంగాణలో రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయని తెలుస్తోంది. ఆ సెలవులు ఎందుకో తెలుసుకుందాం.
Also Read: Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తీవ్ర అన్యాయం.. సీఎం మాటిచ్చినా దక్కని జాక్‌పాట్
తెలంగాణలో డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. వామపక్ష విద్యార్థి సంఘం పీడీఎస్‌యూ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యా రంగంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంతో పీడీఎస్‌యూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు చెల్లించాల్సిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉంచింది. దీనికితోడు ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్) విడుదల చేయడం లేదు. దీని కారణంగా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: Employees Salary Hike: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపు
కళాశాలలు బంద్
విద్యార్థుల సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గాలికొదిలేశారని.. విద్యా శాఖ మంత్రిగా ఉండి కూడా పట్టించుకోకపోవడంపై పీడీఎస్‌యూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం, శుక్రవారం కళాశాలల బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయిస్తున్నట్లు పీడీఎస్‌యూ తెలిపింది. వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే భవిష్యత్‌లో రేవంత్ రెడ్డిపై తిరగబడతామని హెచ్చరించింది.
మూసి ఉంటాయా? తెరచి ఉంటాయా?
అయితే పీడీఎస్‌యూ బంద్ పిలుపుతో కళాశాలలు మూసి ఉంటాయా? తెరచి ఉంటాయా? అనేది గందరగోళం ఏర్పడింది. వాస్తవంగా విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిస్తే కళాశాలలు ఏమీ అధికారికంగా మూతపడవు. విద్యార్థి సంఘాల నాయకులు వచ్చి కళాశాలలను మూసివేసి తరగతుల నుంచి బయటకు పంపిస్తే మాత్రమే సెలవుగా భావించాలి. అంతేకానీ బంద్‌కు పిలుపునిస్తే కళాశాలలు పని చేయవని కావు. కానీ బంద్ సమయంలో కళాశాలలకు వెళ్లకపోవడమే మంచిది. కష్టపడి కళాశాలలకు వెళ్తే అక్కడ నుంచి మళ్లీ పంపించి వేస్తే సమయం వృథా అవుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.