Anchor Shyamala:బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కు ఎందుకు ప్రమోట్ చేశారు. ఎంతంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే అంశాలపై ప్రశ్నిస్తారని తెలుస్తోంది. మంగళవారం విష్ణు ప్రియ, రీతూలను మరోసారి పోలీసులు విచారించనున్నారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన 11 మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణు ప్రియ, రీతూ చౌదరిలను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. వీరితో పాటు సన్నీ, అజయ్, సుధీర్ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
హర్ష సాయి, ఇమ్రాన్ మాత్రం ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు మియాపూర్ కేసులో మొదటగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, మధ్యవర్తులను విచారించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఈ కేసులో ప్రకాష్ రాజ్ .. అప్పట్లో యాప్ ను ప్రమోట్ చేసిన మాట వాస్తవమే కానీ.. ఆ తర్వాత దాన్ని ప్రమోట్ చేయలేదని తెలివిగా సమాధానమిచ్చారు. మరోవైపు విజయ్ దేవరకొండ కూడా బెట్టింగ్ యాప్స్ విషయంలో తాను ఎంతో క్లారిటీతోనే చేసినట్టు వివరణ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.