Hyderabad Rains Updates: తెలంగాణలో రానున్న మూడు రోజులు విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు రుతుపవనాల ప్రభావంతో వానలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.