Telangana Projects: కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో.. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లుఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. అటు తుంగభద్రతో పాటు.. సుంకేసుల ప్రాజెక్టులు కూడా నిండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్ కు ఎగువ నుంచి లక్షా 17వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.