Godavari Rever Flow: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహం పెరిగింది. కాళేశ్వరం పుష్కర ఘాట్లను తాకుతూ గోదారమ్మ ఉరకలేస్తోంది. దీంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో, 5 లక్షల 25 వేల క్యూసెక్కులుగా ఉంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ 85 గేట్లు ఎత్తి ఉంచడంతో నీరు మొత్తం దిగువకు వెళుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 9.700 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 13 మీటర్లు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే గోదావరిలో వస్తున్న ప్రవాహం అంతా ప్రాణహిత నది ప్రవాహమే. మహారాష్ట్రలో కురుస్తున్న వానలతో ప్రాణహిత నది ప్రవహిస్తోంది. ప్రాణహిత నది ప్రవాహం కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలవడం వల్ల గోదావరి నదికి జలకళ వచ్చింది. ఎగువన గోదావరి నదిలో మాత్రం ప్రవాహం లేదు.