All IPL Team Captains In On Frame: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొన్ని గంటల్లో ప్రారంభమవనుండగా జట్టు కెప్టెన్లు సందడి చేశారు. ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద గురువారం ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన కెప్టెన్ల ఫోటోషూట్ సందడిగా జరిగింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఈ ఫొటోషూట్ నిర్వహించారు. 18వ సీజన్‌కు సంబంధించిన పది జట్ల కెప్టెన్లు ఒకే చోట ట్రోఫీతో ఉన్న వీడియోను ఐపీఎల్ విడుదల చేసింది.