Hyderabad News: హైదరాబాద్‌లో కల్తీ కల్లు వ్యవహారంలో మృతి చెందిన వారి సంఖ్య ఆరుకు చేరింది. కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై పలు పోలీసు స్టేషన్‌లలో 5 కేసులు నమోదయ్యాయి. ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా కల్లు అమ్మకాలపై అనుమతులు లేకపోయినా ఎలా అమ్ముతున్నారన్న విషయంపై దర్యాప్తు జరుగుతోంది.