Kuppam woman assault Case: కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప.. మునికన్నప్ప నుంచి రూ. 80,000 అప్పుడు తీసుకున్నాడు. కానీ అది తీర్చకపొవడంతో పాటు, గ్రామం వదిలి వెళ్లిపొయాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తిమ్మరాయప్ప భార్య శిరీష నారాయణపురంలొ తన కొడుకు టీసీ కోసం స్కూల్ కు వచ్చింది. దీంతో శిరీషను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన ఏపీ వ్యాప్తంగా దుమారంగా మారింది. చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని పొలీసుల్ని ఆదేశించారు. హోమంత్రి అనిత రంగంలోకి దిగి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.