Jagan visits Bangarupalyam: మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరులోని బంగారుపాళ్యం పర్యటించారు. ఈ క్రమంలో భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా జగన్ మామిడి పండ్ల రైతుల్ని పరామర్శించేందుకు ఈ పర్యటన చేపట్టారు. గతంలో పల్నాడు పర్యటనలో సైతం అపశృతులు జరిగాయి. తాజాగా.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనలో సైతం అనుకొని ఘటనలు సంభవించాయి. భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తల్నిచెదరగొట్టారు. దీంతో మాజీ సీఎం జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు.