స్పీడ్‌గా బరువు తగ్గడానికి నిమ్మరసం ఎలా తాగాలి?

Dharmaraju Dhurishetty
Jul 10, 2025

చాలామంది బరువు తగ్గడానికి నిమ్మ రసాన్ని ఎంచుకుంటూ ఉంటారు. నిజానికి బరువు తగ్గే క్రమంలో దీనిని తాగొచ్చా?

బరువు తగ్గే క్రమంలో నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి పుష్కలంగా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది.. కాబట్టి ఇది కిడ్నీలో రాళ్లను కూడా తగ్గిస్తుంది.

ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి తగిన మోతాదులో పొటాషియంతో పాటు ఇతర ఖనిజాలు లభిస్తాయి ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

అయితే, చాలామంది బరువు తగ్గే క్రమంలో నిమ్మరసాన్ని ఎలా పడితే అలా తాగుతూ ఉంటారు..

నిజానికి బరువు తగ్గే క్రమంలో నిమ్మరసాన్ని ఓ సరైన పద్ధతిలో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడంలో భాగంగా నిమ్మరసం తీసుకునేవారు తప్పకుండా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకొని తాగాల్సి ఉంటుంది.

కొంతమంది నిమ్మరసంతో పాటు తేనె, ఇతర తీపి కలిగిన పదార్థాలను వేసుకొని తాగుతారు. నిజానికి ఇలా తాగడం మంచిది కాదు.

బరువు తగ్గాలనుకునేవారు నిమ్మరసాన్ని ఒక గ్లాసు నీటిలో కలుపుకొని ఉదయం పరిగడుపున తాగితే అద్భుతమైన ఫలితాలు చూస్తారు.

Read Next Story