America Vs Iran: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని నివారించిన డొనాల్డ్ ట్రంప్ పైనే ఇరాన్ మండిపడుతోంది. యుద్ధం ఆగిపోయేలా అమెరికా మధ్యవర్తిత్వం వహించినా.. ఇరాన్, ఇజ్రాయల్ మాత్రం పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిల్ చుట్టుపక్కల దేశాలైన పాలస్తీనాకు చెందిన హర్కతుల జిహాద్, గాజాకు చెందిన హమాస్, లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా.. యెమన్ కు చెందిన హౌతీలకు వెనకుండి నడిపిస్తూ ఇజ్రాయిల్ ను ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇరాన్ డైరెక్ట్ గా కాకపోయినా..ఇండైరెక్ట్ గా ఇజ్రాయిల్ పై దాడులు చేయిస్తున్నారు. మరోవైపు ఇరాన్ అణు బాంబు తయారు చేస్తే మొదట ప్రయోగించేది ఇజ్రాయిల్ పైనే. అందుకే అమెరికా అండతో ఇజ్రాయిల్ .. ఇరాన్ పై దాడుల నిర్వహించింది. మరోవైపు అమెరికా కూడా డైరెక్ట్ గా ఇరాన్ పై బాంబు దాడులు చేసింది.
మధ్యలో వీరిద్దరి మధ్య ఏమైందో ఏమో.. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఇరు దేశాలతో సంధి చేయించింది. ముందుగా ఇరాన్, ఇజ్రాయిల్ ఈ ఒప్పందాన్ని తూచ్ అంటూ తోసిపుచ్చినా.. ఆ తర్వాత పరస్పర యుద్ధ విరామానికి అంగీకారం తెలిపాయి. ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ జరిగినా.. ఇజ్రాయిల్, ఇరాన్ దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. యుద్ధ విరామానికి ముందు ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ చావు భయంతో ఓ బంకర్ లో దాక్కున్నట్టు అంతర్జాతీయ నిఘా సంస్థలు తెలిపాయి. తాజాగా ఆ దేశ సుప్రీం లీడర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ను చంపేస్తానంటూ మాస్ వార్నింగ్ ిచ్చారు.
ట్రంప్ కు ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ కూడా ఇకపై సేఫ్ కాదని లారిజాని చెప్పారు. అధ్యక్షుడు సన్‌బాత్ చేస్తున్న సమయంలో ఒక డ్రోన్ ఆయన్ను ఢీకొట్టవచ్చని హెచ్చరించారు. ఇది చాలా ఈజీ పని అన్నారు. 2020లో ఇరానియన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యలో ట్రంప్ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయన ఈ హెచ్చరికలు చేశారు.
Also Read :5 పెళ్లిళ్లు.. 300 పైగా చిత్రాలు.. చివరకు ఇంటి గదిలో శవమై కనిపించిన స్టార్ నటుడు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.