Nimisha Priya Death Sentence: నిమిష ప్రియ కేరళకు చెందిన ఈ నర్సుకు యెమెన్‌లో ఈ నెల 16వ తేదీన ఉరిశిక్ష విధించారు. తన వ్యాపార భాగస్వామిని హత్య చేసిందనే కేసులో ఆమెను నిందితురాలిగా నిర్ధారించింది యెమెన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆమెని ఉరి తీయనున్నారు అయితే జూలై 16వ తేదీన ఉరి తీయనున్నట్లు ఒక సామాజిక కార్యకర్త చెప్పారు.
అసలేం జరిగింది?
నిమిష ప్రియ కేరళకు చెందిన ఈ నర్సు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి 2008లో యెమెన్ వెళ్లింది. అక్కడ అనేక ఆసుపత్రుల్లో నర్సుగా పనిచేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత తాను సొంతంగా క్లినిక్ ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే అక్కడి చట్ట ప్రకారం విదేశీయులు ఎవరైనా సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభిస్తే తప్పకుండా స్థానిక వ్యక్తిని కూడా భాగస్వామిగా చేర్చుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో నిమిష ప్రియ తలాల్ అబ్దో మహదీ అనే వ్యక్తిని భాగస్వామిని చేర్చుకుంది.. ఇక క్లినిక్ ప్రారంభించింది అది లాభాల్లో వెళ్ళింది. అయితే కొన్ని రోజులకే తలాల్ అబ్దో మహదీ అసలు రంగు బయటపడింది. నిమిష ప్రియ పాస్‌పోర్ట్ తన వద్ద పెట్టుకుని వేధించసాగాడు. ఈ నేపథ్యంలో నిమిష అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలాల్‌ను అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలేశారు. ఇక జైలు నుంచి బయటకు వచ్చిన తలాల్ ఆమెను మరింత బెదిరించడం ప్రారంభించాడు.
అయితే నిమిషప్రియ భర్త కూతురు కూడా తనతో పాటే ఉండేవారు. హత్యకు కొద్ది రోజులు ముందుగా భారత్ వచ్చేశారు. కానీ, పాస్‌పోర్ట్ లేనందున నిమిష ప్రియా తిరిగి రావడానికి వీల్లేదు తలాల్ ఆమె పాస్‌పోర్ట్ లాక్కొని ఆమెని బ్లాక్ మెయిల్ చేయ సాగాడు. ఇక చేసేదేం లేక నిమిష ప్రియా అతనికి అనస్థీషియా ఇంజెక్ట్ చేసి పారిపోవచ్చని అనుకుంది. ఈ నేపథ్యంలో కాస్త డోస్ ఎక్కువగా ఆమె ఇంజక్షన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అతను చనిపోయాడు. కానీ నిమిష ప్రియ చంపాలనుకోలేదు. స్పృహ కోల్పోయిన తర్వాత పాస్‌పోర్ట్ తీసుకుని పారిపోవాలనుకుంది. అయితే తలాల్ అనుచరుడి ప్రకారం నిమిష ప్రియకు మరో వ్యక్తి కూడా సహాయం చేశాడు.ఇద్దరు కలిసి చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికి నీటి తొట్టెలో పడేశారని ఆరోపించారు. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయే క్రమంలో ఆమెను అరెస్టు చేశారు. 2018లో నిమిషను దోషిగా నిర్ధారించారు.
అయితే అప్పటినుంచి ఆమె కుటుంబీకులు నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి కాపాడాలని కోరుతూనే ఉన్నారు. మరణశిక్షను తగ్గించాలని వేడుకుంటున్నారు. భారత ప్రభుత్వం కూడా యెమెన్ దేశంతో చర్చలు కూడా జరుపుతుంది. ఇంతలోనే జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు జైలు అధికారులు ప్రకటించారు. అయితే నిమిష ప్రియను కాపాడ్డానికి ఒక్కటే మార్గం ఉంది. అది తలాల్ కుటుంబీకులు క్షమాభిక్ష పెట్టడం. అంతే కాదు బ్లడ్ మనీ అనేది కూడా యెమెన్ దేశంలో సాంప్రదాయ పద్ధతి దీనివల్ల శిక్షను తగ్గించడానికి అవకాశం ఉంది.
Also Read : వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని కన్న తండ్రినే కడతేర్చిన కూతురు.. సెకండ్ షో వెళ్లి, సినిమాలకు మించిన ట్విస్టులు!
Also Read :టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. మోదీ సంతాపం, 32 మంది మృతి వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook