Home> అంతర్జాతీయం
Advertisement

Old Man Marries Girl: 45 ఏళ్ల వ్యక్తికి మూడో భార్యగా 6 ఏళ్ల బాలిక.. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా?

45 Years Man Marry 6 Years old: అభం శుభం తెలియని ఆడపిల్లకు అన్యాయం జరిగింది. చిన్నారి పెళ్లికూతురుగా మారింది. ఏకంగా ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తికి మూడో భార్యగా వెళ్ళింది. 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి ఈ ఆరేళ్ల పాపతో వివాహం జరిగింది. ఆఫ్గానిస్తాన్ లో ఈ సంచలన ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం

Old Man Marries Girl: 45 ఏళ్ల వ్యక్తికి మూడో భార్యగా 6 ఏళ్ల బాలిక.. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా?

45 Years Man Marry 6 Years old:  ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్ల అధికారం చేపట్టినప్పటి నుంచి బాల్యవివాహాలు, బలవంతపు పెళ్లిళ్లు రానురాను పెరిగిపోతూ వస్తోంది. ప్రధానంగా తాలిబాన్ల వల్ల మహిళలు, ఆడపిల్లలు వేధింపులకు కూడా గురవుతున్నారు. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఇప్పటికే అక్కడ ఆడపిల్లలకు విద్య అవసరం లేదని తీర్పునిచ్చారు. ఇదిలా ఉండగా హేల్మాండ్ ప్రొవిన్స్ లో 45 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల పాపను పెళ్లి చేయడం సంచలనంగా మారింది. అయితే అతనికి అప్పటికే ఇద్దరు భార్యలు కూడా ఉన్నారు. డబ్బులు ఇచ్చి మరి ఆ పాపను కొనుగోలు చేశాడని ఆఫ్గాన్ మీడియా తెలుపుతోంది. ఈ విషయం అధికారులకు తెలియడంతో చిన్నారి తండ్రి, పెళ్లి కొడుకును అరెస్ట్ చేశారు.

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆ కూతురు పట్ల నిర్దయగా ఉన్నాడు. ఈ సందర్భంగా 45 ఏళ్ల వ్యక్తికి తన కూతుర్ని అమ్మేశాడు. ఆఫ్గానిస్థాన్ ఇది ఒక ముస్లిం దేశం. తాలిబాన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే షరియా చట్టం ప్రకారం ఈ ప్రభుత్వ హయాంలో ప్రజల పరిస్థితి దీనంగా మారింది. ముఖ్యంగా మహిళలు. ఏకంగా 45 ఏళ్ల వయసు, రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికి ఇచ్చి ఆమెను పెళ్లి చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి

45 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల భార్య..
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు సదరు వ్యక్తిని తండ్రిని అరెస్టు చేశారు. కానీ నేరుగా వచ్చి ఎవరు ఫిర్యాదు చేయలేరు. 45 ఏళ్ల వ్యక్తికి అప్పటికే వివాహం జరిగింది . అమ్మాయి కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఆరేళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఆ కుటుంబీకులు సంతోషంగా ఆరేళ్ల బాలికకు వీడ్కోలు కూడా పలికారు. అయితే అక్కడ ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్దగా పట్టనట్లు గా వ్యవహరిస్తోంది. ఆ అమ్మాయికి  9 ఏళ్లు వచ్చే వరకు భర్త వేచి ఉండాలని చెబుతోంది. చేసేదేం లేక ఆ వరుడు తల్లిదండ్రుల వద్దే వదిలేశాడు. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే ఆరేళ్ల బాలికకు ఇలా 45 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాలు నానాటికి పెరిగిపోతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రకారం 25% బాల్యవివాహాలు పెరిగాయి. వీళ్ల అధికారంలో అక్కడ మహిళలు, బాలికలపై కఠినమైన ఆంక్షలు కూడా ఉంటాయి. వారిని విద్య నుంచి దూరంగా ఉంచుతారు. అంతేకాదు పని కూడా చేయకూడదు. పార్కులు, జిమ్‌కు అసలే వెళ్లకూడదు. మొత్తానికి రోడ్డు ఎక్కాలన్నా మగ తోడు ఉండాల్సిందే. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి ముఖాన్ని కవర్ చేసుకోవాలి. లేకపోతే వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి. 

 Also Read :  ఢిల్లీలో భారీ భూ ప్రకంపనాలు.. భయంతో పరుగులు తీసిన జనం, వీడియో వైరల్‌..!

 Also Read :  జూలై 16న యెమెన్‌లో నిమిష ప్రియకు  ఉరితీత.. కాపాడలేని స్థితిలో భారత్‌, ఒక్క ఛాన్స్‌..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Read More