Home> అంతర్జాతీయం
Advertisement

Video: టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. మోదీ సంతాపం, 32 మంది మృతి వీడియో వైరల్‌

Texas Floods Videos: టెక్సాస్ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. అకాల వర్షాలు అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్ లో వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. కేర్ కౌంటి షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 32 కు చేరింది.  ఈ టెక్సాస్ వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. 

Video: టెక్సాస్‌ను ముంచెత్తిన వరదలు.. మోదీ సంతాపం, 32 మంది మృతి వీడియో వైరల్‌

 Texas Floods Videos: అమెరికాలోని టెక్సాస్ లో అకాల వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. వరదలతో అక్కడి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య ఇప్పటివరకు 32 కు చేరుకుంది. మృతుల్లో 18 మంది పెద్దవాళ్ళు ఉండగా.. 14 మంది చిన్నారులు ఉన్నారు. మరో 27 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను కూడా రికవరీ చేశారు. కానీ వారిని ఇంకా గుర్తించలేకపోతున్నారు. మృతుల కుటుంబాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సానుభూతి కూడా తెలియజేశారు.

ప్రకృతి ప్రకోపానికి  ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతూనే ఉంది. పడవలతో పాటు హెలికాప్టర్ల సహాయం కూడా తీసుకుంటున్నారు.  అయితే గురువారం రాత్రి నుంచి భారీ వర్షపాతం నమోదయింది. దీని కారణంగా గ్వాడలూపే నదిలో బలమైన ప్రవాహం ఏర్పడి పరిసర ప్రాంతాల్లోకి వరద ప్రవాహం కొట్టుకు వచ్చింది.

 అయితే కేర్ కౌంటింగ్ షరీఫ్ లారీ మాట్లాడుతూ.. సహాయక చర్యలో ఇప్పటివరకు 230 మందికి పైగా రక్షించాం.. ఇందులో 160 మందిని హెలికాప్టర్లో ద్వారా  రక్షించామన్నారు. అయితే సహాయక చర్యలు కూడా ఇక్కడ ముమ్మరంగా సాగుతున్నట్లు చెబుతున్నారు. ఇక డోనాల్డ్ ట్రంప్ కూడా వరదలకు సంబంధించిన విషయాన్ని అక్కడి గవర్నర్‌ను సంప్రదిస్తున్నాను అన్నారు. ఇక మృతుల కుటుంబాలకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి చెప్పారు.

 ది గర్ల్స్ ఆఫ్ క్యాంప్ మిస్టిక్ మిస్సింగ్..
టెక్సాస్‌ వరదలో ది గర్ల్స్‌ ఆఫ్‌ క్యాంప్‌ మిస్టిక్‌ బాలికలు తప్పిపోయారు.ఇది వేసవి క్రైస్తవ శిబిరం. 20 మందికిపైగా బాలికలు తప్పిపోయారు. అక్కడి నదికి దగ్గరలోనే వీరు క్యాంపింగ్‌ వేసుకున్నారు. ఇక వరదల్లో చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయక చర్యలు కూడా వేగవంతం చేయాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు.

 మోదీ సంతాపం..
వరదలతో టెక్సాస్ జనజీవనం అస్తవ్యస్తం అవడంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం తెలియజేశారు. ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబాలకి మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిల్లలు మృతి చెందారు అన్న వార్త మనసును కలిసివేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్న అని మోడీ ట్విట్ చేశారు. .

 

 

 35 కిలోమీటర్లు కొట్టు కొచ్చిన.. మృత్యుంజయురాలు..
 భారీ వరద నేపథ్యంలో ఎంతో మంది గల్లంతైన సంగతి తెలిసిందే. అయితే ఈ వరద సమయంలో ఓ అద్భుతం నెలకొంది. ఓ 22 ఏళ్ల అమ్మాయి 35 కిలోమీటర్ల దూరం ప్రవాహంలో కొట్టుకపోయింది. అయితే సదర అమ్మాయి సమయస్ఫూర్తితో చెట్టు పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. నాలుగు గంటల తర్వాత సహాయక సిబ్బంది ఆమెని గమనించి బోట్ల సాయంతో కాపాడారు. ఆమెకు కేవలం స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని అధికారులు ప్రకటించారు. ఇక తన కుటుంబ సభ్యులు ఐదు మంది కూడా వరదల్లో కొట్టుకుపోయారని చెప్పారు.

 

 

Also Read :కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఎలోన్‌ మస్క్‌ ప్రకటన.. ట్రంప్‌కు భారీ నష్టమేనా?

Also Read :'వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌కు లైన్‌ క్లియర్‌.. ట్రంప్‌ మేజర్‌ లెజిస్లేటివ్‌ విక్టరీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

Read More