ఉదయాన్నే ఈ రసం తాగితే.. కేజీలకు కేజీల బరువు తగ్గొచ్చు..
Dharmaraju Dhurishetty
Jul 10, 2025
చాలామంది బరువు తగ్గే క్రమంలో డైట్‌లో భాగంగా ఎన్నో రకాల జ్యూస్లను తీసుకుంటూ ఉంటారు.
కొంతమంది బరువు తగ్గే క్రమంలో ఫైబర్ ఎక్కువ మోతాదులో లభించే కొన్ని పండ్లకు సంబంధించిన రసాలు తాగుతూ ఉంటారు.
మరి కొంతమంది అయితే ఎక్కువగా పోషకాలు కలిగిన జ్యూస్‌లను తాగుతూ ఉంటారు.
ముఖ్యంగా బరువు తగ్గే క్రమంలో తప్పకుండా పాలకూర రసం తాగితే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పాలకూర రసంలో లుటిన్, జియాక్సంతిన్, ఇతర ఫైటోన్యూట్రియెంట్లు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
ప్రతిరోజు పాలకూర రసం తాగితే చర్మం ఆరోగ్యంగా తయారవ్వడమే కాకుండా ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజు పాలకూర రసం ఉదయాన్నే తాగితే.. కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలు పొందగలుగుతారు.
పాలకూరలో విటమిన్ కి, విటమిన్ బి, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ఈ రసం రోజు తాగడం మంచిది.
VIEW ALL
Weight Loss: స్పీడ్‌గా బరువు తగ్గడానికి నిమ్మరసం ఎలా తాగాలి?
Read Next Story