కాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?

Dharmaraju Dhurishetty
Jul 08, 2025

చాలామంది ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగుతూ ఉంటారు. నిజానికి ఇలా తాగడం మంచిదేనా.. వైద్యులు ఏమంటున్నారంటే?

చాలామంది రోజు నిమ్మరసాన్ని చక్కెర, తేనె లేకుండా తాగుతూ ఉంటున్నారు. నిజానికి ఇలా తాగడం మంచిది.

ముఖ్యంగా కొంతమంది అయితే పరిగడుపున నిమ్మరసం తాగుతూ ఉంటారు. తాగడం మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

పరిగడుపున నిమ్మరసం తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఎన్నో రకాల పొట్ట సమస్యలు దూరం అవుతాయి.

ప్రతిరోజు ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల అజీర్తి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

ముఖ్యంగా నిమ్మరసం తాగడం వల్ల మలబద్ధకం నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

నిమ్మరసం ఉదయాన్నే తాగితే శరీరానికి తగిన మోతాదులో విటమిన్ సి లభించి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Read Next Story