పాముల్లో ఎప్పుడైనా ఇది గమనించారా?

Dharmaraju Dhurishetty
Jul 09, 2025

చాలామంది పాముకు సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలంటే తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపుతారు.

కొంతమందైతే పాములకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా ఎంతో ఆసక్తిగా గూగుల్ లో సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటారు.

పాములకు సంబంధించిన ఆశ్చర్యం కలిగించే విషయాల్లో ఈరోజు ఒక విషయం మనం తెలుసుకుందాం.

పాములు వాసన చూసేందుకు తమ నాలుకలను వినియోగిస్తాయని అందరికీ తెలిసిన విషయమే..

కానీ మీరు ఎప్పుడైనా పాముకు సంబంధించిన దవడ భాగాలు చూశారా? నోటి భాగాన్ని గమనించారా?

కొన్ని రకాల పాములకు అస్సలు దవడ భాగాల్లోని ఉండే ఎముకలు ఒకదానికొకటి అతుక్కొని ఉండవు.. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా?

దవడ భాగాలు ఒకదానికొకటి అతుక్కుని ఉండకపోవడంతో వాటి తల కంటే ఎక్కువగా పెద్దగా ఉన్న ఆహారాన్ని మింగేందుకు సహాయపడుతుంది.

అందుకే కొన్ని రకాల పాములు పెద్ద పెద్ద ఆహారాలను కూడా ఎంతో సులభంగా మింగేస్తూ ఉంటాయి.

Read Next Story